తాగు..సాగునీటి సమస్యను తీర్చాలి

ప్రకాశం: పర్చూరు నియోజకవర్గంలో తాగు, సాగునీటి సమస్య తీర్చాలని వైయస్‌ఆర్‌సీపీ పర్చూరు నియోజకవర్గ  ఇన్‌చార్జ్‌ రావి రాంబాబు కోరారు.  అన్నా..నియోజకవర్గంలో రైతులు తీవ్ర సంక్షోభంలో ఉన్నారని చెప్పారు. శనగ పంటకు గిట్టుబాటు ధర లేదని చెప్పారు. కందులు, మొక్కజొన్న రైతులు కూడా నష్టాల్లో కూరుకుపోయారని చెప్పారు. మీరు ముఖ్యమంత్రి కావాలని ఈ జనం ఉవ్విళ్లూరుతున్నారని తెలిపారు. రాజన్న రాజ్యంలో ఉన్నట్లుగా మీ పాలన కూడా ఉండాలని స్థానికులు కోరుతున్నారని చెప్పారు. సాగర్‌ జలాలను తీసుకురావాలని కోరారు. వేసవిలో తీవ్ర తాగునీటి ఎద్దడి ఉందని వివరించారు. గుంటూరు చానల్‌ ద్వారా 50 వేల ఎకరాలకు సాగునీరు అందుతుందని, ఆ చానల్‌ను మీరే ఏర్పాటు చేసి ఆదుకోవాలని కోరారు. 
 
Back to Top