రాష్ట్ర వ్యాప్తంగా వైయస్‌ఆర్‌ కాంగ్రెస్ ఆందోళనలు

హైదరాబా‌ద్, 7 ఏప్రిల్‌ 2013:‌ రాష్ట్ర ప్రజలు మోయలేని విధంగా విద్యుత్ ఛార్జీలు పెంచడం,‌ భారీగా పెరిగిన విద్యుత్ కోతలకు నిరసనగా వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ ఆధ్వర్యంలో రాష్ట్రవ్యాప్తంగా ఆందోళనలు కొనసాగుతున్నాయి. హైదరాబాద్ పంజాగుట్ట చౌరస్తాలో ఆదివారంనాడు ప్రభుత్వం దిష్టిబొమ్మను‌ ఆందోళనకారులు దగ్ధం చేశారు. గుంటూరు కలెక్టరేట్ వద్ద నగర కన్వీన‌ర్ లేళ్ల అప్పిరెడ్డి, సమన్వయకర్తలు షౌక‌త్, లాల్పురం రాము ఆధ్వర్యంలో విద్యార్థి విభాగం రిలే‌ దీక్షలు ప్రారంభించింది.

ఖమ్మం జిల్లా వైయస్‌ఆర్‌ కాంగ్రెస్ పార్టీ ‌‌కన్వీనర్ పువ్వాడ అజయ్ కుమా‌ర్ ఆధ్వర్యంలో‌ నేలకొండపల్లిలో ప్రభుత్వం దిష్టిబొమ్మను దగ్ధం చేశారు. ఖమ్మం జిల్లా సత్తుపల్లిలో పార్టీ నాయకులు నల్లబ్యాడ్జీలు ధరించి ప్రదర్శన చేశారు. నల్గొండ జిల్లా నకిరేకల్లులో వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ నాయకుడు సామా శ్రీనివాసరెడ్డి ఆధ్వర్యంలో ప్రజా బ్యాలట్ ‌కార్యక్రమం నిర్వహించారు.

నిజామాబాద్ జిల్లాలో వైయస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ నిర్వహిస్తున్న ప్రజా బ్యా‌లట్ కార్యక్రమానికి మంచి స్పందన లభిస్తోంది. ‌పార్టీ రూరల్ నియోజకవర్గ‌ం ఇన్‌చార్జి అంతిరెడ్డి శ్రీధర్‌రెడ్డి ఆధ్వర్యంలో డిచ్‌పల్లిలో ప్రజా బ్యాలట్ నిర్వహించారు. ప్రజా‌ బ్యాలట్ కార్యక్రమానికి ప్రజలు భారీ సంఖ్యలో‌ వచ్చి ఓటింగ్‌లో పాల్గొన్నారు.
Back to Top