రాష్ట్రంలో రైతు వ్యతిరేక ప్రభుత్వం: మేకపాటి

నెల్లూరు : రాష్ట్రంలో రైతు వ్యతిరేక ప్రభుత్వం కొనసాగుతోదని ఉదయగిరి ఎమ్మెల్యే, వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ సెంట్రల్‌ ఎగ్జిక్యూటివ్‌ కౌన్సిల్‌ సభ్యుడు మేకపాటి చంద్రశేఖరరెడ్డి ఆరోపించారు. నెల్లూరుజిల్లా సీతారామపురం మండలంలోని నాంచారంపల్లిలో ఆదివారం ఆయన మీడియాతో మాట్లాడారు. పాలకులకు పరిపాలనపై సరైన అవగాహన లేక ప్రజలను పలు ఇబ్బందులకు గురిచేస్తున్నారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు.

‌మహానేత డాక్టర్ వై‌యస్ రాజశేఖరరెడ్డి రైతులకు చేసిన మేళ్ళు, ప్రజలపై చూపిన ఆదరణ ఎప్పటికీ మరువలేనివని చంద్రశేఖరరెడ్డి అన్నారు. కాంగ్రెస్ పాలకులు ఎరువుల ధరలు పెంచి, ఎడా, పెడా విద్యు‌త్ కోతలు విధిస్తూ రైతులు ఆత్మహత్యలకు పాల్పడే‌లా చేస్తున్నారన్నారు. నిత్యావసర వస్తువుల ధరలు ఆకాశాన్నంటుతుండడంతో ప్రజలు అనేక ఇబ్బందులు పడుతున్నారన్నారు.

అడ్డదారిలో సహకార ఎన్నికల్లో గెలవాలని కాంగ్రెస్‌ నాయకులు ప్రయత్నాలు చేస్తున్నారని మేకపాటి ఆరోపించారు. వైయస్‌ఆర్‌ కాంగ్రెస్ పార్టీ ‌నాయకులను అక్రమ కేసుల్లో ఇరికించి భయభ్రాంతులకు గురిచేస్తున్నారన్నారు. తగిన సమయంలో ప్రజలు కాంగ్రెస్ ప్రభుత్వానికి బుద్ధి చెబుతార‌ని హెచ్చరించారు. సహకార ఎన్నికల్లో వైయస్‌ఆర్‌సిపి మద్దతుదారులను గెలిపించాలని ఆయన కోరారు. వైయస్‌ఆర్‌సిపి అధినేత శ్రీ జగన్మోహన్‌రెడ్డి ముఖ్యమంత్రి అయితే మహానేత వైయస్‌ఆర్ హయాంలోని స్వర్ణయుగం ‌తీసుకువస్తారన్నారు.
Back to Top