రాజన్న రాజ్యం వస్తుంది: షర్మిల

వైరా(ఖమ్మం జిల్లా) 01 మే 2013:

  గిరిజనులకు రెండు లక్షల ఎకరాలకు యాజమాన్య హక్కు కల్పించిన ఘనత దివంగత మహానేత డాక్టర్ వైయస్‌ఆర్‌దేనని శ్రీమతి షర్మిల చెప్పారు.  ఖమ్మం జిల్లా వైరా నియోజకవర్గంలోని సూర్యతండాలో బుధవారం సాయంత్రం ఆమె రచ్చబండ నిర్వహించారు. ఎడమ కాలి మడమ బెణికిన కారణంగా రెండు రోజులు విశ్రాంతి తీసుకున్న శ్రీమతి షర్మిల బుధవారం ఉదయం మరో ప్రజా ప్రస్థానం పాదయాత్రను ప్రారంభించారు. మహానేత డాక్టర్ వైయస్ఆర్ జీవించి ఉండి ఉంటే మరో ఆరు లక్షల ఎకరాలు ఇచ్చి ఉండేవారన్నారు. కరెంటు బిల్లులు విపరీతంగా పెరిగాయనీ, పంట నష్ట పరిహారం అందలేదనీ గిరిజనులు ఆవేదన వ్యక్తంచేశారు. డాక్టర్ వైయస్ఆర్ హయాంలో పావలా వడ్డీ రుణాలు సక్రమంగా అందేవనీ, ఇప్పుడెవరూ  పట్టించుకోవడం లేదనీ వారు ఫిర్యాదుచేశారు. త్వరలోనే రాజన్న రాజ్యం వస్తుందని శ్రీమతి షర్మిల వారికి భరోసా ఇచ్చారు. జగనన్న సీఎం కాగానే అందరి కష్టాలు తీరతాయని ధైర్యం చెప్పారు. మహిళలకు మేలు చేసేందుకు జగనన్న అమ్మ ఒడి పథకాన్ని రూపొందించారని శ్రీమతి షర్మిల తెలిపారు.

Back to Top