'రాజన్న రాజ్యం వచ్చే వరకు పోరాటం'

నెల్లూరు:

విద్యుత్తు సర్‌చార్జీల వసూళ్లు, కరెంట్ చార్జీల పెంపు ఆలోచన విరమించుకునేలా ప్రభుత్వంపై ఒత్తిడి తెచ్చేందుకు తలపెట్టిన ప్రజాభిప్రాయ సేకరణ అంతం కాదు అరంభమేనని వైయస్ఆర్ కాంగ్రెస్ నగర కన్వీనర్ ఆనం వెంకటరమణారెడ్డి పేర్కొన్నారు. నెల్లూరు నగరంలోని ఆత్మకూరు బస్టాండ్ సెంటర్‌లో  విద్యుత్తు చార్జీలపై ప్రజాభిప్రాయ సేకరణ చేపట్టారు. ఈ సందర్భంగా ఆనం వెంకటరమణారెడ్డి మాట్లాడుతూ రాజన్న రాజ్యం వచ్చే వరకు పోరాటాలు సాగిస్తామన్నారు. కిరణ్ పాలనలో రాష్ట్రం అంధకారంలో ఉందని ఆరోపించారు. మహానేత వైయస్ఆర్ హయాంలో ఏ ఒక్కరూ ఇబ్బంది పడిన దాఖలాలు లేవన్నారు. కిరణ్  పాలనలో అన్ని వర్గాల ప్ర జలు అన్ని విధాలుగా ఇబ్బందులు ఎదుర్కొం టున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. ప్రస్తుతం దుర్మార్గ పాలన ఎప్పుడు అంతమవుతుందా అని ప్రజలు ఎదురు చూస్తున్నారన్నారు. వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షక్షుడు శ్రీ వైయస్  జగన్మోహన్‌ రెడ్డిని ఒక్కడిని చేసి జైల్లో పెట్టించారన్నారు. ప్రజల గుండెల్లో వైయస్ఆర్ నిలిచి ఉన్నారనే విషయాన్ని ప్రజా వ్యతిరేక విధానాలను అవలంబిస్తున్న ప్రభుత్వంపై ప్రజాభిప్రాయ సేకరణలో వ్యక్తం చేస్తున్నారన్నారు. తొమ్మిది రోజుల పాటు నిర్వహించిన ప్రజాభిప్రాయ సేకరణలో వేలాది మంది ప్రజలు తమ అభిప్రాయాన్ని బ్యాలెట్ రూపం లో వ్యక్తం చేస్తున్నారన్నారు.

తాజా వీడియోలు

Back to Top