రాజన్న రాజ్యానికి పునాదివేయండి

కుప్పం:

వ్యవసాయ సహకార సంఘాలకు ఎన్నికలతో రాష్ట్రంలో రాజన్న రాజ్యం స్థాపనకు పునాదులు వేయాలని జెడ్పీ మాజీ చైర్మన్, వైయస్ఆర్ సీపీ నాయకుడు ఎం. సుబ్రమణ్యంరెడ్డి రైతులను కోరారు. చిత్తూరు జిల్లా కుప్పం నియోజకవర్గంలోని శాంతిపురం, గుడుపల్లె మండలాల్లోని పలు గ్రామాల్లో సహకార ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఓటర్లైన రైతులను నేరుగా కలిసి పార్టీ మద్దతుతో పోటీచేస్తున్న అభ్యర్థులను గెలిపించాలని విజ్ఞప్తి చేశారు. దివంగత మహానేత డాక్టర్ వైయస్ రాజశేఖరరెడ్డి హయాంలో రైతుల కోసం ఉన్న పథకాలను సమర్థంగా  అమలుచేయటంతో పాటు మరిన్ని కొత్త పథకాలను తెచ్చే సత్తా ఒక్క శ్రీ వైయస్ జగన్మోహన్‌ రెడ్డికే ఉందన్నారు.  తమ పార్టీవారికి పీఏసీఎస్‌ను అప్పగిస్తే ప్రతి రూపాయి కూడా నేరుగా రైతులకు అందేలా చూస్తామని హామీ ఇచ్చారు.

వైయస్ రుణం తీర్చుకునే అవకాశం
శాంతిపురం: దివంగత మహానేత డాక్టర్ వైయస్ రాజశేఖరరెడ్డి చేపట్టిన పథకాల ద్వారా లబ్ధిపొందిన ప్రతి ఒక్కరికి ఆయన రుణం తీర్చుకునే అవకాశం వచ్చిందని జెడ్పీ మాజీ చైర్మన్ ఎం.సుబ్రమణ్యంరెడ్డి పేర్కొన్నారు.  మండలంలోని గ్రామాల్లో పార్టీ మద్దతుదారులు చేపట్టిన ప్రచార కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. రాళ్లబూదుగూరులో 7వ వార్డు అభ్యర్థి రమేష్‌ను బలపరుస్తూ ఆయన ప్రచారం చేపట్టారు. ఈ ప్రచారంలో మండల పార్టీ కన్వీనరు రఘురామిరెడ్డి, యువజన విభాగం అధ్యక్షుడు గంగాధరం, మునాఫ్, ఫయాజ్, చలపతి, ఉమాశంకర్, కార్యకర్తలు పాల్గొన్నారు.

Back to Top