రాజన్న బిడ్డకు అండగా నడుస్తున్నాం

పత్తికొండ:

ప్రజా సమస్యలను స్వయంగా తెలుసుకునేందుకు పాదయాత్రగా వస్తున్నా రాజన్న బిడ్డ షర్మిలకు అండగా తామూ నడుస్తున్నామని తూర్పుగోదావరి జిల్లాకు చెందిన వైయస్‌ఆర్‌ కాంగ్రెస్ నాయకుడు, అయ్యప్ప మాలధారి జ్యోతుల నవీన్ చెప్పారు. టీడీపీ, కాంగ్రెస్ పార్టీలు చేస్తున్న నీచరాజకీయాలను ప్రజలకు వివరించడానికి పాదయాత్రకు వస్తున్న షర్మిలకు అన్ని వర్గాల ప్రజలు నీరాజనాలు పలుకుతున్నారని చెప్పారు. గతంలో జననేత వైయస్ జగన్మోహన్‌ రెడ్డి అక్రమ కేసుల నుంచి బయట పడాలంటూ జగ్గంపేట నుంచి అన్నవరం వరకు దాదాపు 10 వేల మందితో ఒకే రోజు 65 కిలో మీటర్లు పాదయాత్ర చేసి దేవాలయంలో పూజలు చేశామన్నారు. షర్మిల వెంబడి ఇచ్ఛాపురం వరకు పాదయాత్ర చేస్తామన్నారు. తనతో పాటు అయ్యప్ప స్వాములు జ్యోతుల ప్రవీణ్, నానాజీ, నాగబుబు, బ్రహ్మాజీ, శ్రీహరి పాదయాత్రలో కొనసాగుతున్నారని వివరించారు.

Back to Top