రాజకీయ దురుద్దేశంతోనే మా కుటుంబంపై ఆరోపణలు

నరసరావుపేట 06 మార్చి 2013:

రాజకీయ దురుద్దేశంతోనే చంద్రబాబు మా కుటుంబంపై ఆరోపణలు చేస్తున్నారని
టీడీపీ నేతలపై శ్రీమతి షర్మిల ధ్వజమెత్తారు.  అధికారం ఉంది కదాఅని సీబీఐని
కాంగ్రెస్ తన ఇష్టం వచ్చినట్లు వాడుకుంటోందని ఆమె ఆరోపించారు. నరసరావుపేటలో బుధవారం ఏర్పటుచేసిన బహిరంగ సభలో ఆమె ప్రసంగిస్తూ ఈ వ్యాఖ్యలు చేశారు. మరో ప్రజాప్రస్థానం గుంటూరు జిల్లా నరసరావుపేట పట్టణానికి చేరినపుడు జై జగన్ నినాదాలతో మార్మోగింది. దివంగత మహానేత డాక్టర్ వైయస్ రాజశేఖరరెడ్డి తనయ, వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు శ్రీ వైయస్ జగన్మోహన్ రెడ్డి సోదరి అయిన శ్రీమతి వైయస్ షర్మిల చేపట్టిన మరో ప్రజా ప్రస్థానం పాదయాత్ర బుధవారం సాయంత్రం నరసరావుపేటకు చేరుకుంది.  రాష్ట్ర మంత్రి కాసు కృష్ణారెడ్డి నియోజకవర్గంలో జన ప్రభజనం ముంచెత్తింది. పట్టణంలోని పాత బస్సు స్టాండ్ సెంటర్లో హాజరైన వేలాదిమందినుద్దేశించి ఆమె ప్రసంగించారు. చంద్రబాబుపై నిప్పులు చెరిగారు.  భారీ వర్షంలో తడుస్తూ ఆమె ప్రసంగించారు. వర్షానికి వెలవక ప్రజలు ఆమె ప్రసంగాన్ని శ్రద్ధగా విన్నారు. ఆమె ప్రసంగం ఆమె మాటల్లోనే..

     దివంగత మహానేత డాక్టర్ వైయస్ రాజశేఖరరెడ్డి పదవిలో ఉన్నంత కాలం విద్యుత్తు చార్జీలను ఒక్క రూపాయి కూడా పెంచలేదు. గ్యాస్ ధరను కేంద్రం పెంచినప్పటికీ రాష్ట్ర ప్రభుత్వమే భరించేలా చేశారు. యూపీఏ ప్రభుత్వం ఇప్పటికి 22 సార్లు పెట్రోలు ధరలు పెంచింది.  పెట్రోలు ధరలు పెరిగితే నిత్యావసరాలు పెరుగుతాయనీ, సామాన్యులు ఇబ్బంది పడతారనీ కూడా ఈ యూపీయే ప్రభుత్వం ఆలోచించడం లేదు. మహానేత అధికారంలో ఉండగా ఏ ఒక్క దరనూ పెంచలేదు. పేదల ఆరోగ్యం కోసం ఆరోగ్యశ్రీ ప్రవేశపెట్టారు. రైతుల రుణాలు మాఫీ చేశారు. ఉచిత విద్యుత్తు ఇచ్చారు. ఆయన ప్రవేశ పెట్టిన 108 సర్వీసులు ఫోనుచేసిన పావుగంటలో కుయ్..కుయ్.. అంటూ బాధితులను ఆస్పత్రికి చేర్చేవి. ఇప్పుడు అవి కనిపించనే కనిపించడం లేదు. ఏ పన్ను విధించకుండా అయిదేళ్ళూ పాలించారు.

ప్రతిపక్షనేతగా బాబు పనికిరారు


     అప్పుల్లో కూరుకుపోయి రైతు మూత్ర పిండాలు అమ్ముకుంటున్నారు. అయినప్పటికీ ఈ ప్రభుత్వానికి చీమ కుట్టినట్లు లేదు. ఆరోగ్యశ్రీ, ఫీజు రీయింబర్సుమెంట పథకాలకు జబ్బు చేసింది. ప్రభుత్వాన్ని నిలదీయాల్సిన చంద్రబాబు వీటిగురించి పట్టించుకోరు. అవిశ్వాసం పెట్టరు. మహానేత చేసిన పాదయాత్ర మహోన్నతమైనది. గొప్ప సంకల్పంతో సాగింది. ప్రజల కష్టాలను చూసి వైయస్ తల్లడిల్లారు. చంద్రబాబు ఏసీ బస్సుల్లో తిరుతున్నారు. ఆయన అధికారం కోసం పాదయాత్ర చేపట్టారు. ఆయన ప్రతిపక్షనేతగా పనికిరారు. సొంత మామని వెన్నుపోటు పొడిచి అధికారంలోనికి వచ్చారు. వ్యవసాయం దండగన్నారు. సబ్సిడీలు ఇస్తే ప్రజలు సోమరులవుతారన్నారు. ఉపకారవేతనాలు అడిగితే విద్యార్థులను లాఠీలతో కొట్టించారు. ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు 'వ్యవసాయం దండగ'న్నారు. గుంటూరు జిల్లా రైతులు వెళ్ళి పంటలు ఎండిపోతున్నాయి..  సాగర్ నీళ్ళు విడుదల చేయమని అడిగితే పంటలు ఎందుకు వేసుకున్నారు అని ప్రశ్నించారట. పంటలు ఎండిపోతే ఒకసారి తెలిసొస్తుందన్నారు. అంతేకాక వారిని బెదిరించారట కూడా. ఎన్టీరామారావు చంద్రబాబు నాయుడు గురించి అన్న మాటలను ఇలా గుర్తుచేశారు. 'మాట,మర్యాద లేదు, సభ్యత, సంస్కారం లేదు. అధికారం కోసం ఏ అడ్డదారైనా తొక్కడం. ఏ చెడ్డ పనైనా చేయడం.' చంద్రబాబుకు పెట్టని ఆభరణాలన్నారు. రాజకీయ దురుద్దేశంతోనే చంద్రబాబు మా కుటుంబంపై ఆరోపణలు చేస్తున్నారని టీడీపీ నేతలపై శ్రీమతి షర్మిల ధ్వజమెత్తారు.  అధికారం ఉంది కదాఅని సీబీఐని కాంగ్రెస్ తన ఇష్టం వచ్చినట్లు వాడుకుంటోందని ఆమె ఆరోపించారు.

Back to Top