రాఘవాపురం నుంచి షర్మిల పాదయాత్ర

రాఘవాపురం(చింతలపూడి), 13 మే 2013:

దివంగత మహానేత డాక్టర్ వైయస్ఆర్ తనయ, వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు శ్రీ వైయస్ జగన్మోహన్ రెడ్డి సోదరి అయిన శ్రీమతి వైయస్ షర్మిల చేపట్టిన మరో ప్రజా ప్రస్థానం పాదయాత్ర 147వ రోజుకు చేరింది. సోమవారంనాడు పాదయాత్ర పశ్చిమగోదావరి జిల్లా రాఘవపురం నుంచి ఆరంభమైంది. డీఎన్ రావు పేట, పోతునూరు, మల్లయ్య గూడెం, ఆముదాల చెలక, సమ్మిరి వారి గూడెం మీదుగా ముందుకు సాగుతుంది. తమ అభిమాన నేత వైయస్ఆర్ కుమార్తె రాక కోసం ఎదురు చూస్తున్న పశ్చిమ గోదావరి  ప్రజలు శ్రీమతి షర్మిలకు ఘనంగా ఆహ్వానం పలకడానికి సిద్ధమవుతున్నారు.

Back to Top