రాబోయే ఎన్నికల్లో వైయస్ఆర్‌ సీపీదే విజయం

శ్రీకంఠాపురం:

రాబోయే అసెంబ్లీ ఎన్నికల్లో వైయస్ఆర్‌ కాంగ్రెస్ విజయం సాధిస్తుందని ఆ పార్టీ జిల్లా స్టీరింగ్ కమిటీ సభ్యుడు కొండూరు వేణుగోపాలరెడ్డి చెప్పారు. అనంతపురం జిల్లా శ్రీకంఠాపురంలో 150 మంది పార్టీలో చేరిన సందర్భంగా ఏర్పాటైన కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. పార్టీ బీసీ సెల్ జిల్లా కమిటీ సభ్యుడు వి.పి. రంగప్ప, నాయకుడు ప్రసాద్‌రెడ్డి అధ్యక్షతన ఈ కార్యక్రమం ఏర్పాటైంది. పార్టీలో చేరిన సిద్ధప్ప, మద్దిలేటి, శివకుమార్, నవీన్‌కుమార్, ముత్తప్ప, సుదర్శన్, రవి, నారాయణ, రమేష్‌లతో పాటు 150 మందికి వేణుగోపాలరెడ్డి పార్టీ కండువాలను వేసి స్వాగతం పలికారు. ఆయన మాట్లాడుతూ దివంగత మహానేత డాక్టర్ వైయస్ రాజశేఖర్‌రెడ్డి  చేపట్టిన సంక్షేమ పథకాలు తిరిగి అమలు శ్రీ వైయస్ జగన్మోహన్‌ రెడ్డి ముఖ్యమంత్రయితేనే సాధ్యమన్నారు.  అధికార, ప్రధాన ప్రతిపక్ష పార్టీలు కుమ్మక్కై శ్రీ జగన్మోహన్ రెడ్డిని జైలుపాలు చేశారన్నారు.

రానున్నది రాజన్న రాజ్యం

లేపాక్షి : రాష్ట్రంలో దివంగత మహానేత డాక్టర్ వైయస్ రాజశేఖర రెడ్డి సువర్ణయుగం రాబోతోందని వేణుగోపాల్‌రెడ్డి  చెప్పారు. సి. వెంకటాపురంలో ఆదివారం 70 మంది పార్టీలో చేరారు.  కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ వైఎస్ రాజశేఖర్‌రెడ్డి కులమత, వర్గ, పార్టీలకతీతంగా ప్రజాభివృద్ధికి పాటుపడ్డారని గుర్తు చేశారు. సహకార, స్థానిక సంస్థల ఎన్నికలతోపాటు అసెంబ్లీ ఎన్నికల్లో వైయస్ఆర్‌ కాంగ్రెస్ పార్టీ ఘన విజయం సాధిస్తుందని ఆయన ధీమా వ్యక్తం చేశారు.

Back to Top