హామీలపై గ్రామదర్శినిలో నిలదీయండి

బాబు 1500 రోజుల పాలన అంతా అవినీతి మయం

దమ్ముంటే మేనిఫెస్టోను టీడీపీ వెబ్‌సైట్‌లో పెట్టాలి

బాబు తొలి సంతకాలు, ఎప్పుడో సంతకెళ్లాయి.

గడ్కరీ ప్రశ్నలకు బాబు దగ్గర సమాధానాలు లేవ్‌..

కరువుకు బ్రాండ్‌ అంబాసిడర్‌ చంద్రబాబు

ఏపీకి మూడేళ్ల రుణాలపై సీబీఐ విచారణ చేస్తే టీడీపీ జైల్లోనే..

–వైయస్ఆర్
కాంగ్రెస్‌ మహిళా విభాగం అధ్యక్షురాలు, ఎమ్మెల్యే రోజా

 హైదరాబాద్:  చంద్రబాబు మీడియా సమావేశం
చూస్తే.. దేశంలో అభివృద్ధి చెందే రాష్ట్రాల్లో అగ్రగామిగా ఏపీ నిలిచిందని చెప్పటం
చూస్తే.. తనే తుమ్మి.. చిరంజీవ.. చిరంజీవ అన్నట్లు ఉందని వైయస్ ఆర్ కాంగ్రెస్
మహిళా విభాగం అధ్యక్షురాలు ఎమ్మెల్యే రోజా విమర్శించారు.  మూడు నెలలకే ప్లాఫ్‌ అయిన సినిమాను 1500 రోజులు నడిపించి అదే గొప్పగా చెప్పుకోవటం హాస్యాస్పదమన్నారు.
హైదరాబాద్ పార్టీ కార్యాలయంలో ఆదివారం రోజా మీడియా సమావేశంలో మాట్లాడారు.

                గతంలో చంద్రబాబు
9 ఏళ్లు అధికారంలో ఉన్నారు. 3,178 రోజులు ఇప్పుడు 1500 రోజులు కలిపితే 4678 రోజులు పరిపాలన పేరుతో ప్రజల్ని సర్వనాశనం చేశారు.  గత ఎన్నికల సందర్భంగా ఇచ్చిన 600 హామీలు ఏమయ్యాయని 
గ్రామదర్శిని పేరుతో గ్రామాల్లోకి వస్తున్న తెలుగుదేశం పార్టీ వారిని
నిలదీయాలని పిలుపునిచ్చారు.           చంద్రబాబు 1500 రోజుల పాలనను పూర్తి చేశామంటూ మరోసారి
ప్రచార ఆర్భాటం చేస్తున్నారు తప్పితే, 
ఈ కాలంలో ఆయనకు, ఆయన కుమారుడికి, పచ్చమీడియాకు తప్ప మరెవరికైనా ప్రయోజనం
కలిగిందా అని సూటిగా ప్రశ్నించారు.  రాష్ట్రంలో
ప్రజాసంపదను దోచుకున్నారు. భగవంతుడు సొమ్ము అయిన టీటీడీనీ దోచుకోవాలని ప్లాన్‌లు
వేశారు.  చంద్రబాబు పెట్టిన తొలి అయిదు
సంతకాలు, ఎప్పుడో సంతకెళ్లిపోయాయనీ, వాటన్నిటిని అమలు చేశామంటూ గొప్పలు చెప్పుకోవడం సిగ్గుచేటని
మండిపడ్డారు.

                చంద్రబాబు నాయడు
రాష్ట్రాన్ని సర్వనాశనం చేశారే తప్ప, ప్రజలకు
ఉపయోగపడే ఒక్క సంక్షేమ కార్యక్రమాన్ని కూడా చేపట్టలేదన్నారు. చంద్రబాబుకు తాను
ప్రవేశపెట్టానంటూ చెప్పుకునేందుకు ఒక్క సంక్షేమ పథకం కూడా లేదు. తాను చేసిన తొలి
సంతకాలన్నిటిని అమలు పరిచానంటూ చంద్రబాబు చెప్పుకోవడం వంచన తప్ప మరోటి కాదన్నారు.
తొలి సంతకం అంటే డాక్టర్‌ వైయస్‌ఆర్‌ మాత్రమే గుర్తుకు వస్తారనీ. సంక్షేమ పాలన
అంటే మహానేత వైయస్‌ఆర్‌ హయాంలో ప్రవేశపెట్టిన ఫీజు రీయింబర్స్‌మెంటు, ఆరోగ్యశ్రీ, 108 సేవలు, ఉచిత విద్యుత్‌ వంటివే గుర్తుకు వస్తాయని ఆమె పేర్కొన్నారు. చంద్రబాబుకి
చిత్తశుద్ధి ఉంటే, గత ఎన్నికలకు ముందు విడుదల చేసిన
పార్టీ మేనిఫెస్టోను వెబ్‌సైట్‌ నుంచి 
ఎందుకు తొలగించారో చెప్పాలి. తిరిగి మేనిఫెస్టోను వెబ్‌సైట్‌లో పెట్టిన
తర్వాతనే ప్రజల్లోకి వెళ్లాలి.

                రుణమాఫీ
చేశామంటూ డబ్బాలు కొట్టుకుంటున్న చంద్రబాబు ఒక్క చేనేత రుణాన్ని అయినా మాఫీ చేశారా?
                రైతులు, డ్వాక్రా మహిళల రుణాలను∙మాఫీ చేసి ఉంటే, గతంలో కంటే వారి రుణాలు ఎందుకు
పెరిగాయో బాబు సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. వ్యవసాయ రుణాలు రూ.87,612 కోట్లు అసలు, వడ్డీతో సహా మాఫీ చేస్తానని
మానిఫెస్టోలో పెట్టి.. తిరుపతిలో వెంకన్న సాక్షిగా బాబు చెప్పారు. ఆ మొత్తం అప్పు
లక్ష 12వేల కోట్లుకు చేరింది. మరి, రైతులకు బాబు రుణమాఫీ చేసినట్లా? చేయనట్టా?రైతులు అప్పుల ఊబిలోకి కూరుకుపోవడానికి,
బ్యాంకుల్లో రుణాలు తీసుకున్న డ్వాక్రా మహిళలు
బ్లాక్‌ లిస్టుల్లో ఉండటానికి కారణం ఎవరో అందరికీ తెలిసిందేనని చంద్రబాబు ప్రభుత్వ
వైఖరిపై ధ్వజమెత్తారు.

                డ్వాక్రా మహిళలు
రూ.10వేలు ఇచ్చానని చెప్పుకోవటం వడ్డీ
వ్యాపారస్తుడిలా ఉంది. చంద్రబాబు ఇచ్చే డబ్బు కేపిటల్‌ ఫండ్‌గా ఉపయోగపడుతుంది తప్ప
రుణం తీర్చటానికి ఉపయోగపడదు. మహిళల బంగారం బ్యాంకుల నుంచి వస్తుందని చెప్పి బాబు
మోసం చేశారని రోజా అన్నారు.

                లోటు బడ్జెట్‌లో
16వేల కోట్లు ఉన్నప్పటికీ రాష్ట్రాన్ని
అగ్రగామిగా నిలబెట్టానంటూ చంద్రబాబు చెప్పుకోవడం హాస్యాస్పదంగా ఉంది.                 రాష్ట్రం
విడిపోయేటప్పటికి 96 వేల కోట్ల రుణం ఉంటే.. లక్ష 50 వేల కోట్ల అప్పు తెచ్చి 2.50 లక్షల కోట్ల
అప్పుల్లో ముంచారు.  గత మూడేళ్లలో
సంవత్సరానికి 30 వేల కోట్ల చొప్పన తెచ్చిన రుణాలు
ఏమయ్యాయో అన్న దానిపై సిబిఐ విచారణ జరిపిస్తే చంద్రబాబు, ఆయన కుమారుడుతో సహా అనేక మంది జైళ్లలోనే ఉండాల్సి వస్తుంది.

                కొద్ది రోజులుగా
టిడిపి నేతలు ఇచ్చిన హామీల్లో 99 శాతం అమలు చేశామంటూ స్టాంపు వేసి మరీ
ప్రచారం చేసుకుంటున్నారు. వారికి దమ్ము ధైర్యం ఉంటే, ముందు తమ ఎన్నికల మేనిఫెస్టోను వెబ్‌సైట్‌లో తిరిగి పెట్టాలి. అది
చదివితే సొంత పార్టీ వారే ఓట్లేయరు. టీడీపీ నుంచి బయటకు వెళ్లిపోతారు. సోషల్‌
మీడియాలో లక్షలు లక్షలు జీతాలిచ్చి ప్రచారం చేయించుకుంటున్న అబద్ధపు వార్తలతో
తండ్రీకొడుకులు ఇద్దరూ బతికేస్తున్నారని వారి తీరును విమర్శించారు.

                పోలవరాన్ని 56శాతం పనులు పూర్తి చేసేశానని రాష్ట్రంలో అన్ని ఇరిగేషన్‌
ప్రాజెక్టులు పూర్తి చేశామంటున్నారు. మరి, 9 ఏళ్లు అధికారంలో ఉన్నప్పుడు ఎన్ని ఇరిగేషన్‌ ప్రాజెక్టులు పూర్తి
చేశావ్‌ బాబూ! కనీసం ఎన్టీఆర్‌ ప్రారంభించిన తెలుగు గంగ ప్రాజెక్టును అయినా
పట్టించుకున్నారా అంటూ నిలదీశారు.

                కమిషన్ల కోసం
కేంద్రం చేపట్టాల్సిన పోలవరం ప్రాజెక్టును తీసుకుని, మూడేళ్లుగా నిర్లక్ష్యం చేశారు. వెనుకబడిన జిల్లాల ప్యాకేజీలు అవసరం
లేదని వెయ్యి కోట్ల కమీషన్ల కోసం పట్టిసీమ, పురుషోత్తమపట్నం చేపట్టారనీ. పోలవరంలో జరుగుతున్న అవినీతికి కేంద్ర
మంత్రి గడ్కరీ అడిగిన ప్రశ్నలే తార్కాణం అని రోజా పేర్కొన్నారు. వాటర్‌ స్టోరేజీ
లేకుండా ముంపు ప్రాంతం ఎలా పెరిగింది అని గడ్కరీ ప్రశ్నకు బాబు తీరును ప్రజలు
అర్థం చేసుకున్నారు.

                రైతు బాంధవుడు,
రైతుల్ని ప్రేమించే రాజశేఖరరెడ్డి గారు
ప్రారంభించిన ప్రాజెక్టులు ఇవన్నీ. మహానేత వైయస్‌ఆర్‌ బ్రతికి ఉంటే ఎప్పుడో
ప్రాజెక్టులు పూర్తయ్యేవి. చంద్రబాబు అధికారంలోకి వచ్చిన ప్రతిసారీ కరువు
వస్తుంది. ఇరిగేషన్‌ ప్రాజెక్టుల పేరుతో చంద్రబాబు దోపిడీ తప్ప చేసింది ఏమీ లేదు.

                గతంలో బాబు
అధికారంలో ఉన్న 9 ఏళ్లలో 54 ప్రభుత్వ రంగ పరిశ్రమలు మూసివేయటం, అమ్మివేయటం చేశారు. ఈసారి మంత్రి నారాయణకు చెందిన పాఠశాలలకు గిరాకీ
పెరిగేందుకు, రాష్ట్రంలో ఉన్న 3600 ప్రభుత్వ పాఠశాలలను మూసి వేశారన్నారు.

                ప్రజలకు మంచి
చేసి మెప్పు పొందాలని చంద్రబాబుకు లేదు. కేవలం పచ్చ మీడియాలో పబ్లిసిటీ చేసుకొని
బతకటమే చంద్రబాబుకు తెల్సు. ఎన్టీఆర్‌కు వెన్నుపోటు పొడిచి 1999, 2004,
2014 మూడు ఎన్నికల్లో బీజేపీతో కల్సి వెళ్లింది
బాబే అని మండిపడ్డారు. వాస్తవంలో పొత్తుల కోసం వెంపర్లాడేది చంద్రబాబు నాయుడే అని,
ఇంతవరకు ఏ ఒక్క ఎన్నికల్లో కూడా ఒంటరిగా పోటీ
చేయని చరిత్ర ఉన్న నలభై ఏళ్ల అనుభవమున్న నాయకుడు చంద్రబాబు అని వివరించారు.

                పార్టీ
పెట్టినప్పుటి నుంచి ఒంటరిగా ఎన్నికలకు వెళ్లింది  వైయస్‌ జగన్‌ మాత్రమే. మహానేత వైయస్‌ఆర్‌ మరణం
తర్వాత ప్రతి ఎన్నికల్లోనూ ఒంటరిగా  వైయస్‌
జగన్‌ వెళ్లారు. తనతో పాటు వచ్చిన ఎందరినో  జగన్‌ గెలిపించుకున్న సంగతిని రోజా వివరించారు.

                మహానేత
వైయస్సార్‌ విగ్రహాలను చంద్రబాబు తీసేయెచ్చు కానీ ఆయన సంక్షేమ పథకాలను
తీసేయలేరన్నారు. వాటిని తీసేసే దమ్మూ, ధైర్యం ఉందా? అంటూ
ప్రశ్నించారు.

                అవినీతి,
అక్రమాల్లో రాష్ట్రంలో నెంబర్‌వన్‌గా నిలిపారు.
రాష్ట్రాన్ని అభివృద్ధిగా పెట్టలేకపోయారు. వీటిపై గ్రామదర్శిని సభల్లో ప్రజలకు
బాబు సమాధానం చెప్పాలి.

                బిజెపితో కలిసి
వెళ్లే ప్రసక్తే లేదని పార్టీ అధ్యక్షులు  వైయస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డి అనేక సార్లు
ప్రకటించినప్పటికీ, 15 వందల రోజుల వైఫల్యాలపై ప్రజల  దృష్టి మరల్చడానికి కేంద్ర మంత్రి రాందాస్‌
చేసిన వ్యాఖ్యలను ప్రచారం 
చేసుకుంటున్నారు. పచ్చ మీడియాను బాబు, లోకేశ్‌లు బెదిరించి బ్రేకింగ్‌ న్యూస్‌లు వేయించుకుంటున్నారని
ఎండగట్టారు.

                అసలు బిజెపితో
పొత్తుల విషయంలో మాట్లడానికి రాందాస్‌ ఎవరని, ఆయనతో బాబు, లోకేశ్‌లు ఏ విధంగా మ్యాచ్‌ ఫిక్సింగ్‌
చేసుకున్నారో అర్థం అవుతోంది. స్వయంగా పార్టీ అధ్యక్షులు  వైయస్‌ జగన్‌ పొత్తులు ఉండబోవని స్పష్టం చేసినా
ఇంకా అదే విషయాన్ని మాట్లాడటం వెనక ఉన్న చంద్రబాబు చేస్తున్న కుట్రే దాగున్న విషయం
తేటతెల్లం అవుతోందని రోజా పేర్కొన్నారు.

                ప్రధాని మోడీని
చూస్తే బాబుకు భయం.గడ్కరీని చూస్తే భయం. చివరకు పరకాలను చూసినా తడిసిపోతోంది.  టీటీడీ దోపిడీ, రాజధాని భూముల దోపిడీ మీద, ఓటుకు కోట్లు
కేసు మీద సీబీఐ విచారణ జరిగితే తరతరాలు జైల్లోనే మగ్గే పరిస్థితి వస్తుంది.

                గోదావరి
పుష్కరాల్లో 30 మంది మృతికి చంద్రబాబు కారకుడు అయితే
ఆయన మీద ఇంతవరకు కేసులు నమోదు కాలేదు. నిన్న (శనివారం) స్కూల్స్‌కు సెలవు అయితే
వనం మనం పేరుతో విద్యార్థులను తీసుకెళ్లి పొట్టన పెట్టుకున్నారు. ఆ కుటుంబాల్లో
చిచ్చు పెట్టారు.  ఆఖరికి రాష్ట్రపతి భార్య
వస్తే లైసెన్స్‌ లేని బోటు ఇచ్చి పంపారు. బాబు అధికారంలోకి వచ్చాక రాష్ట్రంలో రాజ్యాంగం
లేదు. పోలీసు వ్యవస్థ లేదని ధ్వజమెత్తారు.

 వైయస్‌ జగన్‌ అధికారంలోకి వచ్చాక సీబీఐ ఎంక్వైరీలు చేయిస్తాం. బాబు
పాలనలో నష్టపోయిన ప్రతి ఒక్కర్నీ ఆదుకుంటామని రోజా స్పష్టం చేశారు. 


తాజా వీడియోలు

తాజా ఫోటోలు

Back to Top