పుత్తా ప్రతాప్‌రెడ్డి అర్ధనగ్న నిరసన

హైదరాబాద్, 27 ఆగస్టు 2013:

చంచల్‌గూడ జైలు పరిసరాల్లో పోలీసుల వైఖరికి నిరసనగా వైయస్ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ యువజన విభాగం రాష్ట్ర అధ్యక్షుడు పుత్తా ప్రతాప్‌రెడ్డి అర్ధనగ్నంగా నిరసన తెలిపారు. ఆందోళన చేస్తున్న ఆయనను పోలీసులు అదుపులోకి తీసున్నారు. చంచల్‌గూడ జైలు పరిసరాల్లో ఆందోళన చేస్తున్న అనేక మందిని పోలీసులు బలవంతంగా అదుపులోకి తీసుకొని పోలీస్ స్టేష‌న్‌కు తరలించారు.

ఇరు ప్రాంతాలకూ సమన్యాయం చేయాలంటూ చంచల్‌గూడ జైలులోనే నిరవధిక నిరాహార దీక్షకు దిగిన శ్రీ వైయస్ జగ‌న్మోహన్‌రెడ్డికి మద్దతు తెలిపేందుకు పార్టీ కార్యకర్తలు, అభిమానులు చంచల్‌గూడకు పెద్దసంఖ్యలో తరలివస్తున్నారు. కాంగ్రెస్‌, సిబిఐలకు వ్యతిరేకంగా పెద్దపెట్టున నినాదాలు చేస్తూ కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల తీరును ఎండగడుతున్నారు. అభిమానుల తాకిడి ఎక్కువ కావటంతో చంచల్‌గూడ పరిసర ప్రాంతాల్లో పోలీసు బలగాలను భారీగా మోహరించారు. ముళ్లకంచెలు ఏర్పాటు చేశారు. అయితే ముళ్ల కంచెలను కూడా లెక్కచేయకుండా అభిమానులు చంచల్‌గూడ వద్దకు చేరుకుంటున్నారు.

Back to Top