బాబు చేతిలో కీలుబొమ్మలు

హైదరాబాద్ః ఏపీ బీజేపీ నేతలు చంద్రబాబు చేతిలో కీలుబొమ్మలుగా మారారని  వెల్లంపల్లి శ్రీనివాస్ అన్నారు. రాష్ట్రంలో బీజేపీ పూర్తిగా వైఫల్యం చెందిందని అన్నారు.  కేంద్రప్రభుత్వం చంద్రబాబును దొంగలాగ చూడడం వల్లే రాష్ట్రానికి నిధులివ్వడం లేదని అన్నారు. కాసేపటి క్రితమే వైయస్సార్సీపీ అధ్యక్షులు వైయస్ జగన్ సమక్షంలో వెల్లంపల్లి శ్రీనివాస్ బీజేపీని వీడి వైయస్సార్ కాంగ్రెస్ పార్టీలో చేరారు. ఈ సందర్భంగా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు రాష్ట్రానికి చేస్తున్న అన్యాయంపై మండిపడ్డారు.

Back to Top