ఫిరాయింపుదారులపై వేటు ఖాయం

ఒంగోలు: ముఖ్యమంత్రి పదవి కోసం సాగిలపడిన చంద్రబాబు ఆంధ్రప్రదేశ్ కు ప్రత్యేక హోదా అడగడం మానేశారని వైయస్ఆర్ సీపీ నేత, ఒంగోలు ఎంపీ వైవీ సుబ్బారెడ్డి ఆరోపించారు. ఒంగోలులో ఆయన మీడియాతో మాట్లాడారు. ప్రత్యేక హోదా ఇస్తామన్న బీజేపీ మాట మారుస్తోందని ఫైరయ్యారు. ప్రత్యేక హోదా సాధించే వరకు వైయస్ఆర్ సీపీ పోరాటం చేస్తూనే ఉంటుందని ఆయన స్పష్టం చేశారు. పార్టీ ఫిరాయించిన ప్రజాప్రతినిధులపై వేటు తప్పదని హెచ్చరించారు. ఫిరాయింపుదారులపై  సుప్రీంకోర్టులో ఇప్పటికే కేసు వేశామని  వైవీ సుబ్బారెడ్డి తెలిపారు.

Back to Top