బాబుకు శిక్ష తప్పదు..?

()ఓటుకు కోట్లు కేసులో రెడ్ హ్యాండెడ్ గా దొరికిపోయారు
()బ్లాక్ మనీతో తెలంగాణలో ఎమ్మెల్యేలను కొనాలని చూశారు
()తప్పించుకునేందుకు "స్టే" లతో కాలం గడుపుతున్నాడు
()వైయస్సార్సీపీ ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి

న్యూఢిల్లీ : ఓటుకు కోట్లు కేసులో ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు రెడ్ హ్యాండెడ్ గా పట్టుబడినా...స్టేలతో కాలం గడుపుతున్నాడని వైయస్సార్సీపీ మంగళగిరి ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి ఫైర్ అయ్యారు. ఇప్పటి వరకు 18 కేసుల్లో  బాబు స్టే తెచ్చున్నారని ఎద్దేవా చేశారు. ఓటుకు కోట్లు కేసులోనూ హైకోర్టు నుంచి స్టే తెచ్చుకుంటే... 4 వారాల్లోగా తేల్చాలని సుప్రీంకోర్టు స్పష్టం చేసిందని ఆయన గుర్తు చేశారు. ఏ తప్పు చేయకపోతే స్టే ఎందుకు తెచ్చుకున్నారని చంద్రబాబును ఆర్కే సూటిగా ప్రశ్నించారు.

ఓటుకు కోట్లు కేసులో చంద్రబాబు అడ్డంగా దొరికిపోయారన్నారు. బ్లాక్మనీతో తెలంగాణ ఎమ్మెల్యేలను కొనాలని చంద్రబాబు ప్రయత్నించారని విమర్శించారు. ఆడియో టేపుల్లోని వాయిస్ ముమ్మాటికీ చంద్రబాబుదే అని ఆర్కే స్పష్టం చేశారు. అది తన వాయిస్ కాదని చంద్రబాబు ఎప్పుడు చెప్పలేదన్నారు. ఓటుకు కోట్లు కేసులో చంద్రబాబుకు శిక్ష తప్పదన్నారు.

ఓటుకు కోట్లు కేసులో విచారణను రద్దు చేయాలంటూ  చంద్రబాబు దాఖలు చేసిన క్వాష్ పిటిషన్‌పై విచారణను నాలుగు వారాల్లో ముగించాలని సుప్రీంకోర్టు ఆదేశించింది. ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి తరఫున సీనియర్ న్యాయవాది శేఖర్ నాప్‌డే వాదనలు వినిపించగా బాబు తరపున సిద్ధార్థ లూథ్రా వాదనలు వినిపించారు. అవినీతి నిరోధక చట్టం కింద నమోదైన కేసులో స్టే ఎలా ఇస్తారని,  వేటి ఆధారంగా ఈ కేసులో హైకోర్టు స్టే ఇచ్చిందని వాదనల సందర్భంగా సుప్రీం జడ్జి లూథ్రాను ప్రశ్నించారు. 
Back to Top