పుల్లారావు.. రాజీమానాకు సిద్ధమా?

  • ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డి బహిరంగ సవాల్‌
  • ఎవరు ఎక్కువుగా తిడుతారో వారికే మైక్‌ ఇస్తున్నారు
  • ప్రజలు మేలు చేయాలనే ఓపికతో వైయస్‌ జగన్‌ భరిస్తున్నారు

  • ఏపీ అసెంబ్లీ: అగ్రిగోల్డు భూములను మంత్రి ప్రత్తిపాటి పుల్లారావు తన భార్య పేరిట కొనుగోలు చేశారని, దానికి సంబంధించిన ఆధారాలు తన వద్ద ఉన్నాయని మంత్రి పదవికి ఆయన రాజీనామా చేసేందుకు సిద్ధమా అని వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డి బహిరంగ సవాల్‌ విసిరారు. శుక్రవారం మీడియా పాయింట్‌లో చెవిరెడ్డి మాట్లాడారు.. చంద్రబాబు ఆలోచన విధానం, నైతిక విలువల్లో దిగజారిపోయారు.మీ అంతు చూస్తాం, అలగజానం అంటు అన్‌పార్లమెంటరీ పదాలతో మాట్లాడుతున్నారు. ఆయన్ను మించి టీడీపీ సభ్యులు మాట్లాడుతున్నారు. కానీ మా నాయకుడికి ఓపిక ఉంది. ప్రజలకు మేలు చేయాలని భరిస్తున్నారు. మనం బ్యాలెన్స్‌ తప్పితే రాష్ట్ర ప్రజలకు అన్యాయం జరుగుతుందని భరిస్తున్నారు. ఓటుకు కోట్లు కేసు ఏపీకి సంబంధం లేకపోవడం ఏంటీ. అక్కడ ఉన్నది ఆంధ్ర ముఖ్యమంత్రి చంద్రబాబు కాదా? రెడ్‌హ్యాండెడ్‌గా దొరికిపోయారు. ఆ గొంతు బాబుదే అని పోరెన్సిక్‌ ల్యాబ్‌ రిపోర్టులు ఇచ్చింది. సుప్రీం కోర్టు నోటీసులు ఇస్తే దాన్ని కూడా తప్పు పడుతున్నారా? సుప్రీం కోర్టు ఆ కేసును యాక్సేప్ట్‌ చేసిందంటే దాంట్లో ఎంతో కొంత నిజం ఉన్నట్లే కదా? ఇది పనికిమాలిన కేసు అంటే సుప్రీం కోర్టు జడ్జిలను కూడా మీరు తప్పుపడుతున్నారా? అంటే వీళ్లు కోర్టులను కూడా మాట్లాడే స్థాయికి దిగారు. ఇన్ని రోజులు ప్రతిపక్షాన్నే అనుకున్నాం. ప్రజలనే అనుకున్నాం. ఇప్పుడు టీడీపీ నాయకులు కోర్టులను కూడా తిడుతున్నారు. కోర్డుకు వ్యతిరేకంగా కరపత్రాలు పంచుతున్నారు. నిన్న సభలో టీడీపీ నేతలు చించుకొని మాట్లాడారు. తొడలు కొట్టారు. తెల్చుకుందామన్నారు. మాకు కూడా తొడలు కొట్టే అవకాశం ఇచ్చి ఉంటే మేం కొట్టేవాళ్లం. మీరే తొడకొట్టేసి, మీరే చాలెంజ్‌లు విసిరి జారుకొని వెళ్లే ఎలా?. మా పక్క నిజముంది, నిజాయితీ ఉంది, వాస్తవం ఉంది. నిరూపిస్తాం. మీరు అన్ని రకాల శిక్షకు సిద్ధపడాలి. నేను ఇక్కడే ప్రజలకు నిరూపిస్తున్నాను. ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం పాస్‌బుక్‌ నంబర్‌ 525, పేరు ప్రత్తిపాటి వెంకాయమ్మ, భర్త పుల్లారావు, చిలుకలూరిపేట, ఆమె ఫోటోపైన తహశీల్దార్‌ సంతకం పెట్టారు. ఫోటోపై సంతకం ఒకటుంది, కింద మరొకటి ఉంది. వ్యవసాయదారుడుగా వెంకాయమ్మ ఉండాలి, ఇక్కడ ఉదయ్‌ కిరణ్‌ వచ్చాడు. ఇదేం మాల్‌ప్రాక్టిస్‌ అని చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డి నిలదీశారు. ఈ పాస్‌బుక్‌ అబద్ధమా? నేను చాలెంజ్‌ చేస్తున్నాను. ఇది అబద్ధమైతే నేను ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేస్తా, ఇదే నిజమైతే నీవు మంత్రి పదవి నుంచి తప్పుకుంటావా? ఆధారాలు, అంకెలతో పాటు నేను చాలెంజ్‌ చేస్తున్నాను. పుల్లారావు సిద్ధంగా ఉన్నారా. 

    స్పీకరే ప్రోత్సహిస్తున్నారు
    అసెంబ్లీని దారుణంగా నడుపుతున్నారని ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డి మండిపడ్డారు. స్పీకరే టీడీపీ సభ్యులను ప్రోత్సహిస్తున్నారు. ఎవరు ఎక్కువగా మా నాయకుడిని తిడుతారో, మా పార్టీని తిడుతారో, చనిపోయిన దివంగత నేత వైయస్‌ రాజశేఖరరెడ్డిని తిడుతారో వారికే మైక్‌ ఇచ్చి తిట్టించే కార్యక్రమం చేస్తున్నారు. వారు తిడుతుంటే స్పీకర్‌ లోలోపల ఆనందపడుతున్నట్లు కనిపిస్తోంది. స్పీకర్‌ఇలాంటి కార్యక్రమాలు చేయడం బాధాకరం. సభా ఆర్డర్‌లో లేనప్పుడు దాన్ని సరిచేయాలి, ప్రజలకు సంబంధించిన అంశాలపై ప్రతిపక్షానికి మాట్లాడే అవకాశం కల్పించాలి.
Back to Top