దేవినేని అస‌మ‌ర్థ‌త వ‌ల్లే: జోగి ర‌మేష్‌

విజయవాడ: మ‌ంత్రి దేవినేని ఉమ‌ అసమర్థత వల్లే పులిచింతల‌ ప్రాజెక్టు ఆగిందని వైయ‌స్సార్ కాంగ్రెస్ పార్టీ అధికార‌ప్ర‌తినిధి, మాజీ ఎమ్మెల్యే జోగి ర‌మేష్ అన్నారు. విజ‌య‌వాడ‌లోని పార్టీ కార్యాల‌యంలో ఆయ‌న మీడియాతో మాట్లాడారు.  దేవినేని ఉమ అసమర్థ, అజ్ఞాన, నీచమైన మంత్రి ఆయ‌న విమర్శించారు. ఇలాంటి వ్యక్తిని ఎప్పుడూ నీటిపారుదల శాఖ మంత్రిగా చూడలేదని అన్నారు. దేవినేనికు చిన్నప్పుడు పిచ్చికుక్క కరిచిందని, అందుకే అమావాస్య, పౌర్ణమినాడు విచిత్రంగా ప్రవర్తిస్తున్నాడ‌ని ఆయ‌న ఎద్దేవా చేశారు. డబ్బులు దండుకోవడానికి పట్టిసీమ ప్రాజెక్టు కట్టార‌ని, ఇందులో 500 కోట్ల అవినీతి జ‌రిగింద‌ని ర‌మేష్ మండిప‌డ్డారు. ఈ ప్రాజెక్టు వల్ల చుక్కనీరు కూడా కృష్ణా డెల్టాకు రాలేదని చెప్పారు. జూన్ లో కృష్ణా డెల్టాకు నీళ్లు ఇస్తామన్న విషయం ఏమైందని ప్రశ్నించారు. టీడీపీ దోపిడీ, దుర్మార‍్గాలను వైయ‌స్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు, ప్రతిపక్ష నేత వైయ‌స్ జగన్ మోహన్ రెడ్డి అడ్డుకోవడం తప్పా అని నిలదీశారు.
 ప్రాజెక్టులతో పాటు కృష్ణా పుష్కర పనుల్లోనూ దోచుకుంటున్నారని విమర్శించారు. ఇసుక నుంచి మట్టి వరకు అన్నింటిలోను దోపిడీయే కారణం అన్నారు. అందులో దేవినేని ఉమ‌ వాటా ఎంతో దుర్గమ్మ సాక్షిగా చెప్పాలని డిమాండ్ చేశారు. తెలంగాణ అక్రమ ప్రాజెక్టులపై వైయ‌స్సార్ కాంగ్రెస్ పార్టీ ప్రశ్నించిందని అన్నారు. అయినా చంద్రబాబు ప్రభుత్వం మాత్రం పట్టించుకోలేదని ఆయ‌న వివ‌రించారు. తెలంగాణ అక్రమ ప్రాజెక్టులపై వైయ‌స్ జగన్ మాట్లాడితే వాళ్లు మాత్రం భయంతో పారిపోయి వచ్చారని చెప్పారు. దేవుడు కరుణిస్తే తప్ప సొంత నియోజకవర్గానికి నీళ్లు ఇవ్వలేని దద్దమ్మ ఉమ అని అన్నారు. దమ్ముంటే తనతో కలిసి కృష్ణా డెల్టాకు రావాలని, అలా వస్తే రైతులు కొట్టడం ఖాయం అని చెప్పారు. కృష్ణా డెల్టాను ఏడారిగా మార్చిన దద్దమ్మ ఉమనే అని జోగి ర‌మేష్ మండిపడ్డారు.
Back to Top