వైయస్సార్‌సీపీ ఆధ్వర్యంలో ఘనంగా పూలే జయంతి

అనంతపురం :మహాత్మ జ్యోతిరావు పూలే గొప్ప సామాజిక తత్వవేత్త అని వక్తలు కొనియాడారు. ఈ మేరకు మంగళవారం జ్యోతిరావు పూలే జయంతిని వైయస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ కార్యాలయంలో ఘనంగా జరుపుకున్నారు. ముందుగా పూలే చిత్రఫటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. అనంతరం ఎమ్మెల్యే విశ్వేశ్వరరెడ్డి మాట్లాడుతూ... జ్యోతిరావు పూలే మంచి సంఘకర్త అన్నారు. సామాజిక చైతన్యం కోసం అప్పట్లోనే పోరాటాలు చేశారని గుర్తు చేశారు. సామాజిక చైతన్యం కోసం పోరాటాలు చేయడం అప్పట్లో పెద్ద సాహసమేనన్నారు. ఆయన ఆశయాల సాధనకు కృషి చేయాలని పిలుపునిచ్చారు. పార్టీ జిల్లా అధ్యక్షులు శంకరనారాయణ మాట్లాడుతూ... బడుగు, బలహీన వర్గాల కోసం జ్యోతిరావు పూలే అనేక త్యాగాలు చేశారన్నారు. ఆయా వర్గాల అభ్యున్నతికి ఆయన కుటుంబమంతా కృషి చేసిందన్నారు. ఆయన ఆశయాల సాధనకు దివంగత వైయస్‌ కృషి చేశారన్నారు. అదే స్ఫూర్తితో భవిష్యత్తులో వైయస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ముందుకెళ్తారన్నారు. మాజీ మేయర్‌ రాగే పరుశురాం మాట్లాడుతూ... అణగారిన వర్గాల అభివృద్ధికి జ్యోతిరావు పూలే అహర్నిశలు కష్టపడ్డారన్నారు. దామాషా ప్రకారం ప్రయోజనాలు దక్కాలనే లక్ష్యంగా పోరాటాలు చేశారన్నారు. వెనుకబడిన వర్గాల్లో చైతన్యం నింపేందుకు చర్యలు తీసుకున్నారన్నారు. మైనార్టీ విభాగం రాష్ట్ర అధ్యక్షులు నదీంఅహ్మద్‌ మాట్లాడుతూ... స్వాతంత్య్రం రాకముందే వెనుకబడిన వర్గాలను గుర్తించి వారి అభివృద్ధికి జ్యోతిరావు పూలే అడుగులేశారన్నారు. అనంతరం సంగమేష్‌ సర్కిల్‌లోని జ్యోతిరావు పూలే విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. కార్యక్రమంలో క్రమశిక్షణ సంఘం సభ్యులు బి. ఎర్రిస్వామిరెడ్డి, పార్టీ రాష్ట్ర కార్యదర్శి గౌస్‌బేగ్, నగర అధ్యక్షులు రంగంపేట గోపాల్‌రెడ్డి, జిల్లా అధికార ప్రతినిధులు చింతకుంట మధు, వీరన్న, ఆలుమూరు శ్రీనివాసరెడ్డి, నాయకులు కొర్రపాడు హుసేన్‌పీరా, జేఎం బాషా, యూపీ నాగిరెడ్డి, విద్యార్థి విభాగం బండి పరుశురాం, బీసీ సెల్‌ శీనా, మహిళా విభాగం బోయ సుశీలమ్మ, కార్పొరేటర్‌ గిరిజమ్మ తదితరులు పాల్గొన్నారు.

Back to Top