ఘనంగా పూలే జయంతి వేడుకలు

పామర్రు:విద్యను అన్ని వర్గాల ప్రజలకు అందించాలని పాటుపడిన మహనీయుడు జ్యోతిరావు పూలే అని, ఆయనను ప్రతి ఒక్కరూ ఆదర్శంగా తీసుకోవాలని వైయ‌స్ఆర్ సీపీ నియోజకవర్గ సమన్వయ కర్త కైలే అనీల్‌కుమార్ అన్నారు. మంగళవారం స్థానిక వైయ‌స్సార్ సీపీ కార్యాలయలంలో పూలే 191 జయంతి సందర్భంగా ఆయన చిత్ర పటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. అనీల్‌కుమార్‌ మాట్లాడుతూ సమాజం విద్యతోనే అభివృద్ది చెందుతుందని ప్రతి ఒక్కరూ విద్యావంతులు కావాలని ఆకాంక్షించిన మొదటి వ్యక్తి పూలే అన్నారు. బాలికలు కూడా విద్యానేర్చుకోవాలనే ఉద్దేశ్యంతో తన భార్య సావిత్రి పూలే కు చదువు నేర్పించి ఆమె చేత ∙బాలికలను చదువు చెప్పించి మహిళా విద్యను ప్రొత్సహించారన్నారు.  బాల్యవివాహాలను అరికడుతూ వితంతు వివాహాలను ప్రోత్సహించిన వ్యక్తి పూలే అన్నారు. తొలిసారిగా మహాత్మా అన్న బిరుదు పొందిన వ్యక్తి పూలే అన్నారు. కార్యక్రమంలో పార్టీ రాష్ట్ర సభ్యులు ఎం. కాశిరెడ్డి తదితరులు పాల్గొన్నారు.
Back to Top