జనం..జనం ప్రభంజనం..గళం..గళం జగన్నినాదం.. పదం..పదం విజయనాదం..వేలాది మంది వెంట నడవగా షర్మిల చేపట్టిన ‘మరో ప్రజాప్రస్థానం’ పాదయాత్ర గురువారం మధ్యాహ్నం పాలమూరు జిల్లాలో అడుగుపెట్టింది. గురువారం తొలిరోజు పుల్లూరు, కలుగొట్ల మీదుగా 11 కిలోమీటర్ల మేర యాత్ర కొనసాగించారు.మహబూబ్‌నగర్: ఊళ్లకు ఊళ్లే తరలి వచ్చాయి. జనప్రవాహం ముందు తుంగభద్రమ్మ చిన్నబోయింది. లక్షలాదిగా వచ్చిన జనంతో పుల్లూరు పు లకించింది. ప్రజల సమస్యలను విస్మరించిన అధికార కాంగ్రెస్‌పార్టీ, దానికి అంటకాగుతున్న ప్రతిపక్ష టీడీపీల వైఖరికి నిరసనగా వైయస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైయస్ జగన్‌మోహన్‌రెడ్డి తరఫున ఆయన సోదరి షర్మిల చేపట్టిన మరో ప్రజాప్రస్థానం పాదయాత్రకు లక్షలాది జనం మద్దతు పలికారు. కర్నూలు శివారు ప్రాంతం నుంచి మహబూబ్‌నగర్ జిల్లా సరిహద్దు పు ల్లూరు గ్రామం వరకు జాతీయ రహదారిపై భా రీ జనసందోహం మధ్య యాత్ర కొనసాగింది.గురువారం మధ్యాహ్నం 3.30 గంటలకు మరో ప్రజాప్రస్థానం పాదయాత్ర పాలమూరు జిల్లాలోకి ప్రవేశించింది. కడప, అనంతపురం, క ర్నూలు జిల్లాల్లో కంటే రెట్టించిన ఉత్సాహంతో జిల్లా నలుమూలల నుంచి జనం తండోపతండాలుగా తరలొచ్చి వైయస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ గౌ రవ అధ్యక్షురాలు, పులివెందుల ఎమ్మెల్యే విజయమ్మ, షర్మిలకు ఘనస్వాగతం పలికారు. మ హానేత దివంగత ముఖ్యమంత్రి వైయస్ రాజశేఖ రరెడ్డి మిగిలిన ప్రాంతాల కంటే తెలంగాణ ప్రాంత అభివృద్ధికి పెద్దపీట వేయడం వల్ల ఎంతోమంది లబ్ధిదారులు ప్రయోజనం పొందారని, అందుకే ఆయన కుమార్తె ప్రజాసమస్యలు తెలుసుకునేందుకు యాత్ర చేస్తుంటే తామంతా ఆమెకు మద్దతు ఇచ్చేందుకు తరలొచ్చామని వె ల్లడించారు.