మడకపాలెం శివాలయంలో పూజలు

మునగపాక: మండలంలోని మడకపాలెం గ్రామంలో శివాలయం వద్ద ధ్వజస్తంభం ఏర్పాటు వేడుకలు ఘనంగా జరిగాయి. ప్రజలంతా భక్తి శ్రద్దలతో వేడుకలు జరుపుకున్నారు. వేదపండితుల మంత్రోచ్ఛరణల మధ్య ఉదయం నుంచి ఆలయం వద్ద ప్రత్యేక పూజలు నిర్వహించారు. అలాగే వేదపండితుల సమక్షంలో పెద్ద ఎత్తున హోమం నిర్వహించారు. దీనిలో భాగంగా వైయస్సార్‌సీపీ నియోజకవర్గ సమన్వయ కర్త బొడ్డేడ ప్రసాద్, చెర్లోపాలెం మాజీ సర్పంచ్‌ కాయల ప్రకాశరావు, చూచుకొండ ఎంపీటీసీ పెంటకోట అప్పలనాయుడు తదితరులు ఈ వేడుకల్లో పాల్గొని పరమేశ్వరుడిని దర్శించుకున్నారు. సర్పంచ్‌ జాజుల సత్యవతి, మార్కెట్‌కమిటీ మాజీ డైరెక్టర్‌ వెంకటరమణ, మాజీ సర్పంచ్‌ సూరిబాబుతోపాటు గ్రామస్తులు పెద్దసంఖ్యలో ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. అనంతరం ఆలయ ప్రాంగణంలో ఏర్పాటు చేసిన అన్న సమారాధనకు భక్తులు భారీగా తరలివచ్చారు.

Back to Top