రిషికేశ్ లో పూజలు

న్యూఢిల్లీ : రిషికేశ్ లో ప్రతిపక్ష నేత, వైయస్సార్సీపీ అధ్యక్షులు వైయస్ జగన్ గంగానదికి పూజలు నిర్వహించారు. అక్కడ శారదా పీఠాధిపతి స్వరూపానందేంద్ర సరస్వతి చాతుర్మాస దీక్షలో విశేష పూజలు చేస్తున్నారు. ఈ ప్రక్రియలో వైయస్ జగన్ పాల్గొని గంగానదికి ప్రత్యేక అర్చనలు చేశారు. అనంతరం స్వరూపానంద స్వామి ఆశీస్సులు తీసుకొన్నారు. 


అనంతరం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి మంచి జరగాలని, ప్రత్యేక హోదా కాంక్షిస్తూఈ పూజలు నిర్వహించారు. వైయస్‌ జగన్‌ వెంట ఎంపీలు వైఎస్ అవినాష్ రెడ్డి, విజయసాయిరెడ్డి, మిథున్‑రెడ్డితోపాటు పార్టీ  అగ్రనేత భూమన కరుణాకర్ రెడ్డి ఉన్నారు.

 

తాజా వీడియోలు

తాజా ఫోటోలు

Back to Top