ఎమ్మెల్యేలు పోయినా ప్ర‌జ‌లు మా వెంటే - న‌ల్ల‌పురెడ్డి

నెల్లూరు :ఎమ‌్మెల్యేలు పార్టీ నుంచి వెళ్లినా ప్ర‌జ‌లు మాత్రం పార్టీ వెంటే ఉన్నార‌ని వైయ‌స్సార్సీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి నల్లపరెడ్డి ప్రసన్నకుమార్‌రెడ్డి అన్నారు.  పార్టీ నుంచి ఒక నాయకుడు పోతే వందమంది నాయకులు పుడతారని ఆయన అన్నారు. నెల్లూరు జిల్లా వాకాడులోని పార్టీ సీజీసీ సభ్యులు డాక్టర్ నేదుమల్లి పద్మనాభరెడ్డి నివాసంలో వాకాడు, చిట్టమూరు మండలాల పార్టీ కార్యకర్తలు, నాయకులతో ప్రసన్న సమావేశమయ్యారు. ఆయన మాట్లాడుతూ గూడురు ఎమ్మెల్యే సునీల్ పార్టీకి ద్రోహం చేసి వెళ్లడం దారుణమన్నారు. ఎమ్మెల్యే సునీల్ పార్టీని వీడినా ప్రజలు మాత్రం వైఎస్ జగన్ వెంటే ఉన్నారన్నారు. కార్యకర్తలకు, నాయకులకు తమ పార్టీలో కొదవలేదన్నారు. ఎమ్మెల్యేలను ప్రలోభపెట్ట్టి టీడీపీలో చేర్చుకున్నా వైయస్ జగన్ ను ఏమీ చేయలేరన్నారు. అధికార పార్టీని చూసి ఎవరూ భయపడాల్సిన అవసరంలేదన్నారు. త్వరలోనే నియోజవర్గంలోని అన్ని గ్రామాల్లో పర్యటించి పార్టీని మరింత బలోపేతం చేస్తామని చెప్పారు.
 
 విజయసాయిరెడ్డికి సముచితస్థానం
 
 వైఎస్సార్‌సీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి విజయసాయిరెడ్డిని రాజ్యసభ అభ్యర్థిగా పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ఎంపికచేయడం సముచితమని నల్లపరెడ్డి ప్రసన్నకుమార్‌రెడ్డి తెలిపారు. పార్టీ అభివృద్ధికి పాటుపడుతున్న విజయసాయిరెడ్డిని ఎంపిక చేసినందుకు జగన్‌మోహన్‌రెడ్డికి పార్టీ శ్రేణులు అభినందనలు తెలుపుతున్నాయన్నారు.
 
Back to Top