ప్రజా సంక్షేమాన్ని గాలికొదిలేసిన టీడీపీ

విశాఖపట్నం(మునగపాక): ప్రజా వ్యతిరేక విధానాలను అవలంభిస్తున్నటీడీపీ సర్కార్ పై   వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ రాజీలేని పోరాటం చేస్తోందని ఆ పార్టీ అరకు పార్లమెంట్‌ నియోజకవర్గ పరిశీలకులు బొడ్డేడ ప్రసాద్‌ అన్నారు. మునగపాకలోని పార్టీ కార్యాలయంలోఆయన మండల స్థాయి ముఖ్యనేతలతో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా ప్రసాద్‌ మాట్లాడుతూ... తెలుగుదేశం ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన నాటినుంచి ప్రజా సంక్షేమాన్ని మర్చిందన్నారు.  

ఎన్‌టీఆర్‌ హౌసింగ్‌పథకానికి సంబంధించి నిరుపేదలకు అవకాశం ఇవ్వకుండా..టీడీపీ వాళ్లకు మాత్రమే చోటు కల్పించి పథకాన్ని నిర్వీర్యం చేస్తున్నారన్నారు. రాజకీయాలకు అతీతంగా లబ్దిదారుల ఎంపిక జరగాల్సి ఉన్నా ఎక్కడా అమలు కావడం లేదన్నారు. అలాగే పశువుల షెడ్‌లకు సంబందించి నిబంధనలకు తిలోదకాలు ఇస్తున్నారన్నారు.  అధికారులపై ఒత్తిడి తీసుకువచ్చి పథకాల్లో అవినీతి, అక్రమాలకు పాల్పడుతున్నారన్నారు. ఇలాంటి ప్రజా వ్యతిరేక ప్రభుత్వంపై పోరాటాలకు సిద్ధం కావాలని బొడ్డేడ ప్రసాద్‌ ప్రజలకు పిలుపునిచ్చారు.  సమావేశంలో పార్టీ మండల కన్వీనర్‌ మళ్ల సంజీవరావు, పీఏసీఎస్‌ అధ్యక్షుడు టెక్కలి కొండలరావు, మునగపాక, అరబుపాలెం సర్పంచ్‌లు టెక్కలి రమణబాబు, లంబా అప్పారావు తదితరులు పాల్గొన్నారు.
Back to Top