వైయస్‌ జగన్‌ ప్రభంజనాన్ని బాబులు తట్టుకోలేరు

నంద్యాల: ఎంత మంది చంద్రబాబులు, లోకేష్‌లు వచ్చినా నంద్యాలలో వైయస్‌ జగన్‌ ప్రభంజనాన్ని తట్టుకోలేరని వైయస్‌ఆర్‌ సీపీ అధికార ప్రతినిధి వెల్లంపల్లి శ్రీనివాసులు అన్నారు. వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ అధినేత, ప్రతిపక్షనేత వైయస్‌ జగన్‌ నంద్యాల రోడ్‌ షోలో లేళ్ల అప్పిరెడ్డి, వెల్లంపల్లి శ్రీనివాసులు మాట్లాడారు. ఈ సందర్భంగా రోడ్‌ షోకు లభిస్తున్న ఘన స్వాగతాలు చూస్తుంటే 25వ తేదీన వచ్చే వినాయక చవితి పండుగ వాతావారణం 10వ తేదీనే వచ్చిందా అన్నట్లుగా ఉందని వారు అన్నారు. దివంగత మహానేత డాక్టర్‌ వైయస్‌ రాజశేఖరరెడ్డి కుమారుడు నంద్యాల ప్రాంతాల్లో తిరుగుతుంటే ప్రజలంతా బ్రహ్మారథం పడుతున్నారన్నారు. మహానేత వైయస్‌ఆర్‌ చేసిన అభివృద్ధిని ప్రజలంతా గుర్తు చేసుకుంటున్నారన్నారు. ప్రజాభిమానం చూస్తుంటే 23వ తేదీ జరిగే ఎన్నికల్లో వైయస్‌ఆర్‌ సీపీ అభ్యర్థి శిల్పా మోహన్‌రెడ్డి అత్యధిక మెజార్టీతో గెలుస్తారన్నారు. నంద్యాల ప్రజలంతా రాష్ట్ర సర్కార్‌ వైఫల్యాలను గుర్తు చేసుకుంటున్నారని, ఎంత మంది మంత్రులు, ఎమ్మెల్యేలు నంద్యాలలో తిష్ట వేసినా టీడీపీకి ఓటమి తథ్యమన్నారు. 

తాజా ఫోటోలు

Back to Top