బాబును ప్రజలు క్షమించరు

బాబు అన్ని వర్గాలను మోసం చేశారు
అబద్ధాలు, అవినీతితో కాలం వెళ్లదీస్తున్నాడు
పాలకుడు అంటే  వైయస్సారే
వైయస్ జగన్ నాయకత్వంలో ప్రజల పక్షాన పోరాడుదాం
వైయస్సార్సీపీ బలోపేత కోసం కృషి చేద్దాంః పార్టీ నేతలు

విజయవాడ: దివంగత ముఖ్యమంత్రి వైయస్‌ రాజశేఖరరెడ్డి నాడు దేశంలోనే ఆంధ్ర రాష్ట్ర ప్రజలకు గొప్ప పాలన అందించారని వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ ప్రధాన కార్యదర్శి, మాజీ మంత్రి ధర్మాన ప్రసాదరావు అన్నారు. అయితే ప్రస్తుతం రాష్ట్రంలో చంద్రబాబు అన్ని వ్యవస్థలను నిర్వీర్యం చేసి ప్రజలను మభ్యపెడుతున్నారని మండిపడ్డారు. విజయవాడలో పార్టీ విస్తృత స్థాయి సమావేశంలో ధర్మాన మాట్లాడుతూ..రెండేళ్లుగా ఆంధ్ర రాష్ట్రంలో ప్రధాన ప్రతిపక్ష పార్టీ బాధ్యతలను వైయస్‌ఆర్‌సీపీ సమర్ధవంతంగా నిర్వహించిందన్నారు. ఇక్కడికి వచ్చిన ప్రతి ఒక్కరూ ప్రభుత్వ నిర్భందంలో ప్రజాస్వామ్యబద్ధంగా పోరాటం చేస్తున్నారని అభినందించారు. పార్టీ నాయకుడిగా మనం ఏం చేయాలి. ప్రధాన ప్రతిపక్షంగా రాజకీయ పార్టీగా మన బాధ్యత ఏంటన్నది గుర్తుంచుకోవాలన్నారు. ప్రభుత్వ సంక్షేమ పథకాల్లో లొసుగులను ఎత్తి చూపాల్సిన బాధ్యత మనదే అన్నారు.

రాష్ట్రంలో విచిత్రమైన పాలన
రెండేళ్లలో ఏపీలో విచిత్రమైన పాలన సాగుతుందని ధర్మాన ప్రసాదరావు ధ్వజమెత్తారు. ఏ రాష్ట్రంలో కూడా ఇలాంటి పరిపాలన సాగడం లేదన్నారు.  దివంగత ముఖ్యమంత్రి డాక్టర్‌ వైయస్‌ రాజశేఖరరెడ్డి 2004లో సీఎం అయినప్పుడు ప్రజాస్వామ్యం పట్ల ఎన్నికైన ప్రభుత్వాలు ఎంత గొప్పగా పాలించవచ్చో చూపించారన్నారు. ఒక ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకం అర్హులందరికి అందాలంటే..సీఎం అందరివాడై ఉండాలన్నారు. పార్టీలకు, కులాలకు, మతాలకు అతీతంగా వైయస్‌ఆర్‌ సంక్షేమ పథకాలు అమలు చేశారని కొనియాడారు. చాలా మంది ఆయనతో ఉన్న వారు కూడా ఇలాంటి కార్యక్రమాలను వ్యతిరేకించినా వైయస్‌ఆర్‌ వెనుకడుగు వేయలేదన్నారు. అందుకే గొప్ప పరిపాలన అందించారని తెలిపారు. ప్రతి రోజు సీఎం స్థాయి వ్యక్తిని సామాన్యులు కలిసే వీలు ఉండదని భావించి పేదలందరికీ కార్పొరేట్‌ వైద్యం అందించేందుకు వైయస్ రాజశేఖరరెడ్డి రాజీవ్‌ ఆరోగ్యశ్రీ పథకం అమలు చేశారు. ఈ పథకం ద్వారా తెల్లకార్డు కలిగిన వ్యక్తి కార్పొరేట్‌ ఆసుపత్రిలో వైద్యం చేయించుకున్నారని వివరించారు.

రాష్ట్రంలో చాలా అన్యాయమైన పాలన సాగుతోందని ఆందోళన వ్యక్తం చేశారు. పేదలకు ఉచిత వైద్యం అందడం లేదని, ఆరోగ్యశ్రీ పథకం అమలు కావడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. పేదల భూములను లాక్కొని ప్రభుత్వమే రియల్‌ ఎస్టేట్‌ వ్యాపారం చేస్తోందని ఆరోపించారు. వాటిని ప్రశ్నించిన ప్రతిపక్షంపై ఎదురుదాడికి దిగడం దుర్మార్గమన్నారు.. నాడు వైయస్‌ఆర్‌ పేదలకు ఉన్నత విద్యను అందుబాటులోకి తెచ్చేందుకు ఫీజు రీయింబర్స్‌మెంట్‌ పథకాన్ని ప్రవేశపెట్టారన్నారు. బీద వర్గాన్ని మార్పు చేసేందుకు గొప్ప ఆయుధంగా వైయస్‌ఆర్‌ ఈ పథకాన్ని ప్రవేశపెడితే టీడీపీ సర్కార్‌ తూట్లు పొడిచిందని ధ్వజమెత్తారు. బీద ప్రజలను నిరాశ, నిసృహాల్లోకి నెట్టుతోందని ఆగ్రహం వ్యక్తం చేశారు.. చంద్రబాబు వ్యవసాయ రంగాన్ని విస్మరించడంతో, ప్రైవేట్‌ వడ్డీ వ్యాపారులు రైతులను దోచుకోకూడదని చెప్పి నాడు దివంగత ముఖ్యమంత్రి వడ్డీ లేని రుణాలు మంజూరు చేశారని తెలిపారు. 

చంద్రబాబు చేసిన మోసం వల్ల ప్రజలు రుణం కట్టకపోవడంతో అప్పుల ఊబిలో చిక్కుకున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. రూ.300 కోట్ల లంచాలకు ఆశ పడి పోలవరాన్ని పక్కన పెట్టి పట్టిసీమ ప్రాజెక్టు చేపట్టారు. నిరంతరం విద్యుత్‌ ఇస్తున్నామని అబద్ధాలు చెబుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. కేంద్రం లక్ష మెగావాట్ల విద్యుత్‌ ఉత్పత్తి చేసిందని..ఏప్రిల్‌ 15, 2015లో కేంద్ర విద్యుత్‌ శాఖ మంత్రి ప్రకటించారన్నారు. అయితే ఈ ఘనత కూడా తనదే అన్నట్లుగా రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించుకుంటుందని తప్పు పట్టారు. రాజ్యాంగబద్దమైన కమిటీలను కాదని కిరికిరి కమిటీలు(జన్మభూమి) ఏర్పాటు చేశారని దుయ్యబట్టారు. వెయ్యి రూపాయిల పింఛన్‌ వస్తే..వీరు రూ.500 లాక్కుంటున్నారని ఆరోపించారు. 

రెండు సంవత్సరాల్లో అన్ని వర్గాలు నష్టపోయాయి. కేంద్ర ప్రభుత్వం 12 సంస్థలు ఇస్తే..ఒక్కటి కూడా శ్రీకాకుళంకు తీసుకురాలేదని విమర్శించారు. ఒక ప్రాంతంలోనే అభివృద్ధిని వికేంద్రించారని చంద్రబాబుపై ఆగ్రహం వ్యక్తం చేశారు.. అత్యంత వెనుకబడిన జిల్లా శ్రీకాకుళం, రాయలసీమ ప్రాంతాల  అభివృద్ధిని విస్మరించారన్నారు. కారణం ఏంటంటే..ఈ జిల్లాలో వైయస్‌ఆర్‌సీపీకి అనుకూలంగా ఉన్నారనే చంద్రబాబు కక్షకట్టారని విమర్శించారు. ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కరూ బాధ్యతగా పార్టీ బలోపేతానికి కృషి చేయాలని కోరారు.  మనకు బలమైన నాయకుడు వైయస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డి ఉన్నారని, అలాంటి వ్యక్తి అండతో ముందుకు సాగుదామని, ముందున్న మూడేళ్లు లక్ష్యసాధన వైపు కదలాలని ధర్మాన ప్రసాదరావు పిలుపునిచ్చారు. 

వైయస్ జగన్ సీఎం అవుతారనే విభజన..
 ఎంపీ మేకపాటి రాజమోహన్ రెడ్డి
విజయవాడ: ఉమ్మడి ఆంధ్రప్రదేశ్కు వైఎస్ జగన్ ముఖ్యమంత్రి అవుతారనే... రాష్ట్రాన్ని అశాస్త్రీయంగా విభజించారని వైయస్ఆర్ సీపీ ఎంపీ మేకపాటి రాజమోహన్ రెడ్డి అన్నారు. పార్టీ విస్తృత స్థాయి సమావేశంలో ఆయన మాట్లాడుతూ రాష్ట్రాన్ని చాలా దుర్మార్గంగా విభజించారన్నారు. విభజన సమయంలో ఆంధ్రప్రదేశ్కు అయిదేళ్లు ప్రత్యేక హోదా ఇస్తామని కాంగ్రెస్ అంటే... కాదు పదేళ్లు ఇవ్వాలని బీజేపీ అడిగిందనే విషయాన్ని గుర్తు చేశారు. అయితే ఇప్పుడు మాత్రం ప్రత్యేక హోదా కాదు...ప్రత్యేక ప్యాకేజీ అంటున్నారని మేకపాటి మండిపడ్డారు. హోదా ఇవ్వాల్సిన బాధ్యత కేంద్రానిదని, దాన్ని సాధించాల్సిన బాధ్యత చంద్రబాబుదన్నారు.

ప్రత్యేక హోదాతోనే రాష్ట్రం అభివృద్ధి చెందుతుందని మేకపాటి అన్నారు. హోదా కోసం ప్రజలు ఆశగా ఎదురు చూస్తున్నారని, హోదా సాధించేవరకూ వైయస్ఆర్ సీపీ పోరాటం కొనసాగిస్తూనే ఉంటుందన్నారు. ఈ విషయంలో ఇప్పటికే ప్రధానిని, ఆర్థికమంత్రి అరుణ్ జైట్లీని వైయస్ జగన్ కలిసి విజ్ఞప్తి చేసిన విషయాన్ని మేకపాటి ఈ సందర్భంగా గుర్తు చేశారు. పార్లమెంట్ లోపల, వెలుపల వైయస్ఆర్ సీపీ ఎంపీలందరు చాలాసార్లు పోరాడామన్నారు. టీడీపీకి ప్రత్యేక హోదాపై ఏమాత్రం చిత్తశుద్ధిలేదని, ఓ వైపు చంద్రబాబు రాష్ట్రానికి అన్యాయం చేస్తూ, మరోవైపు అప్రజాస్వామిక చర్యలు చేపడుతున్నారన్నారు. ఓ పార్టీ గుర్తుపై గెలిచిన ఎమ్మెల్యేలను ప్రలోభాలకు గురిచేసి, కొనుగోలు చేయడం ఎంతవరకు సమంజసమన్నారు. ప్రత్యేక హోదా సాధించే విషయంలో చంద్రబాబు విఫలం అయితే ప్రజలు క్షమించరన్నారు.

అబద్ధాలు మాని అభివృద్ధి చేయాలి..
ఎంపీ వరప్రసాద్
విజయవాడః అబద్ధాలతో బతుకుతూ... అవినీతితో కాలం వెళ్లదీస్తున్న వ్యక్తి చంద్రబాబు అని వైయస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ ఎంపీ వరప్రసాద్‌ మండిపడ్డారు. విజయవాడలో పార్టీ విస్తతస్థాయి సమావేశంలో ఆయన మాట్లాడారు. రాష్ట్రాన్ని విభజించవద్దని  వైయస్ జగన్ ఆనాడు పదేపదే చెప్పిినా పట్టించుకోలేదని, బాబు రెండు కళ్ల సిద్ధాంతం వల్లే రాష్ట్రానికి ఈపరిస్థితి దాపురించిందని మండిపడ్డారు.  విభజన జరిగిన అనంతరం ప్రత్యేక హోదా రాకపోతే ఏవిధంగా నష్టాపోతామో బాబుకు తెలియలేదా అని ఆయన ప్రశ్నించారు. రాష్ట్రం అభివద్ధి చెందాలంటే ఒక్క ప్రత్యేక హోదాతోనే సాధ్యమన్నారు. చంద్రబాబు ప్రజలను అన్ని విధాలుగా మోసం చేస్తున్నారని ఆరోపించారు. ప్రత్యేక హోదా కోసం వైయస్‌ జగన్‌ దీక్ష చేసినా బాబు స్పందించలేదన్నారు.  వైయస్సార్‌సీపీ  ఎంపీలు అందరూ  పార్లమెంటులో నిరసన తెలియజేసిన విషయాన్ని గుర్తు చేశారు. 

అవినీతి... అక్రమాలు బయటపడతాయనే...
ప్రత్యేక హోదా కోసం ఒత్తిడి తెస్తే అవినీతి, అక్రమాలు బయట పడతాయన్న భయంతోనే బాబు నోరు మూసుకున్నారని విమర్శించారు. బాబు  ప్రత్యేక హోదా తీసుకురాకపోతే ...రాబోయే ఎన్నికల్లో వైయస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ ఘనవిజయం సాధిస్తుందని,  వైయస్‌ జగన్‌మోహన్‌రెడ్డి  ప్రత్యేక హోదాను తీసుకొస్తారని వరప్రసాద్‌ చెప్పారు. ప్రభుత్వ పథకాలన్నీ మోసపూరిత పథకాలేనన్నారు. పేద వారి కోసం కేంద్రం ఇచ్చిన నిధులను చంద్రన్న బాట అని తన పేరుమీద ప్రచారం చేసి నిధులు ఇవ్వడానికి సిగ్గు లేదా అని నిప్పులు చెరిగారు.

మోదీ ఒక్కపైసా తీసుకురాలేదు...
రాజధాని శంకుస్థాపనకు వచ్చిన ప్రధాన మంత్రి  ఒక్క పైసా కూడా తీసుకురాలేదని అంతకన్నా అవమానం ఏమైనా ఉందా అని ఆయన బాబును నిలదీశారు. నిధులు భర్తీ చేయాలంటే ప్రత్యేక హోదా తీసుకొచ్చి విభజన చట్టంలో ఉన్న వాటిని అమలు పర్చాలని సూచించారు. ఇప్పటికైనా అబద్ధాలు చెప్పడం మానేసి అభివద్ధి బాట పట్టాలని ఆయన డిమాండ్‌ చేశారు.

Back to Top