జ‌నం..ప్ర‌భంజ‌నం..!

పులివెందుల‌: ప్ర‌తిప‌క్ష నేత‌, వైఎస్సార్సీపీ అధ్య‌క్షుడు వైఎస్ జ‌గ‌న్ ప‌ర్య‌ట‌న జ‌య‌ప్ర‌దంగా జ‌రుగుతోంది. పెద్ద ఎత్తున నాయ‌కులు, కార్య‌క‌ర్త‌లు, అభిమానులు జ‌న నేత ప‌ర్య‌ట‌న‌లో మ‌మేకం అవుతున్నారు.


ఉద‌యం వేంప‌ల్లి లో అంబేద్క‌ర్ విగ్ర‌హానికి పూల మాల వేసి నివాళులు అర్పించారు. త‌ర్వాత స్థానిక క‌ళ్యాణ‌మండ‌పంలో బాబూ జ‌గ్జీవ‌న్ రామ్ చిత్ర‌ప‌టానికి పూల మాల వేసి జ‌యంతి వేడుక‌ల్లో పాల్గొన్నారు. త‌ర్వాత స్థానిక వేంక‌టేశ్వ‌ర స్వామి దేవాల‌యంలో పూజ‌లుచేయించారు. అనంత‌రం ఎర్రిపాలెం వెళ్లారు.


ఇటీవ‌ల మ‌ర‌ణించిన పార్టీ కార్య‌క‌ర్త కుటుంబాన్ని ప‌ల‌క‌రించారు. ఆ కుటుంబానికి ధైర్యం చెప్పారు. వైఎస్ జ‌గ‌న్ ప‌ర్య‌ట‌న‌లో జ‌నం ప్ర‌భంజ‌నంలా పాల్గొంటున్నారు.


జ‌న నేత తో మ‌మేకం అయ్యేందుకు పోటీ ప‌డుతున్నారు. ఎర్రిపాలెంలో నాయ‌కులు, కార్య‌క‌ర్త‌లు వైఎస్‌జ‌గ‌న్ ను చుట్టుముట్టారు. పేరు పేరునా ప‌ల‌క‌రించి యోగ క్షేమాలు తెలుసుకొన్నారు. 

Back to Top