బాబు పాలనపై ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత: వైఎస్ జగన్

విశాఖపట్నః
చంద్రబాబు ఎన్నికల ముందు ఇచ్చిన ఏ ఒక్క హామీని అమలు చేయడం లేదని ప్రతిపక్ష నేత
వైఎస్సార్సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్ మండిపడ్డారు. ఎన్నికల ముందు అబద్ధాలు
చెప్పడం..అయిపోయాక ప్రజలను మోసం చేయడమే బాబుకున్న విశ్వనీయత అని ధ్వజమెత్తారు.
ప్రత్యేక రైల్వే జోన్ కోసం వైఎస్సార్సీపీ తరపున విశాఖ లో నిరవధిక నిరాహార దీక్ష కు
దిగిన గుడివాడ అమర్ నాథ్ ను వైఎస్ జగన్ ఆసుపత్రిలో పరామర్శించారు. నిమ్మరసం ఇచ్చి
దీక్షను విరమింప చేశారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు.

 అధికారంలోకి వచ్చి రెండేళ్లవుతున్నా...ప్రత్యేకహోదా, రైల్వే జోన్, పోలవరానికి రావాల్సిన వనరులు సహా ఏ
ఒక్కదానిపైనా బాబు కేంద్రాన్ని నిలదీసిన పాపాన పోవడం లేదన్నారు. ఓటుకు కోట్లు
కేసులో,
అవినీతి
సొమ్ముతో ప్రలభపెట్టి ఎమ్మెల్యేలను కొన్న వాటిపై కేంద్రం విచారణ చేపడుతుందని
 బాబు భయపడుతున్నారన్నారు.  

టీడీపీ సర్కార్
పై  రెండేళ్లలోనే ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత వచ్చిందని...ప్రజలు బాబును
రాళ్లతో కొట్టే పరిస్థితి వచ్చిందని వైఎస్ జగన్ అన్నారు. బాబు పాలనపై ప్రజలు
విసిగెత్తిపోయారు గనుకే రాష్ట్రంలో ఇవాళ ధర్నాలు, దీక్షలు చేస్తున్న పరిస్థితులు నెలకొన్నాయన్నారు.
బాబుకు ప్రజలు,
దేవుడు తగిన
బుద్ధి చెబుతారని హెచ్చరించారు. 

 

Back to Top