ప్రజా పంపిణీ వ్యవస్థ అస్తవ్యస్తం-ఎమ్మెల్యే కాకాణిగోవర్థన్‌రెడ్డి

 నెల్లూరు: సాంకేతిక పరిజ్ఞానం కొత్త పుంతలు తొక్కుతున్న రాష్ట్రంలో సర్వర్‌ సమస్యతో ప్రజా పంపిణీ వ్యవస్థ అస్థవ్యస్తంగా మారిపోయిందనీ వైయస్‌ఆర్‌సీపీ జిల్లా అద్యక్షులు, సర్వేపల్లి ఎమ్మెల్యే కాకాణి గోవర్థన్‌రెడ్డి విమర్శించారు. తోటపల్లి గూడూరు మండల పరిషత్‌ కార్యాలయంలో జరిగిన గ్రీవెన్స్‌ డే కార్యక్రమంలో పాల్గొన్న కాకాణి ప్రజా సమస్యలు అడిగి తెలుసుకొన్నారు.   ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ టెక్నాలజీలో హైటెక్‌ బాబుగా గొప్పలు చెప్పుకొని సీఎం చంద్రబాబు ఈ– సర్వర్‌ సమస్యలను పరిష్కరించలేకపోవడం అతని చేతకానితనమన్నారు. చంద్రబాబునాయుడి రెండేళ్ల పాలనలో  రాష్ట్రం ఎలాంటి అభివృద్ధికి నోచుకోలేకపోయిందని ఆందోళన వ్యక్తం చేశారు. సంక్షేమ పథకాల అమలులో రాష్ట్ర ప్రభుత్వం మరింత దిగజారిపోయిందన్నారు. రేషన్‌ కార్డులు, పింఛన్లు, పక్కా గృహాలు ఇలా ఏ ఒక్కటి అర్హులకు అందడం లేదన్నారు. గతంలో వైఎస్‌ రాజశేఖర్‌రెడ్డి సీఎంగా ఉన్నప్పుడు ఇస్తున్న 49 లక్షల పింఛన్లే తప్ప.. నేడు  రాష్ట్రంలో ఏ ఒక్కరికి కొత్తగా పింఛన్లు ఇవ్వడం లేదని కాకాణి ఆరోపించారు. రాజకీయాలతీతంగా అర్హులకే ప్రభుత్వ ఫలాలను అందించాలన్నారు. సమస్యల పరిష్కారం కోరుతూ వచ్చే ప్రజలను కార్యాలయాల చుట్టూ  మాటిమాటికి తిప్పుకోకుండా వీలైనంత తొందరగా వారి సమస్యలను పరిష్కరించేందుకు అధికారులు ప్రయత్నించాలన్నారు. 

Back to Top