చంద్రబాబుపై ఆగ్రహంగా ఉన్న ప్రజలు

తిరుపతి: వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ అధినేత వైయస్‌ జగన్‌మోహన్‌రెడ్డి దివంగత మహానేత వైయస్‌ రాజశేఖరరెడ్డిలాగే ప్రజల మనస్సులు గెలుచుకుంటున్నారని పార్టీ ప్రధాన కార్యదర్శి భూమన కరుణాకర్‌రెడ్డి అన్నారు. తిరుపతిలో ఆయన వైయస్‌ఆర్‌ కుటుంబం కార్యక్రమంలో పాల్గొని మాట్లాడుతూ.. వైయస్‌ జగన్‌ ప్రకటించిన నవరత్నాల కార్యక్రమాలు అద్బుతంగా, ఆచరణయోగ్యంగా ఉన్నాయని ప్రజలు అంటున్నారన్నారు. చంద్రబాబు ఎన్నికల సమయంలో 600ల హామీలు ఇచ్చి ప్రజలచేత ఓట్లు వేయించుకొని అధికారంలోకి వచ్చిన తరువాత వాటిని నెరవేర్చకపోవడంతో ప్రజలు ఆగ్రహంతో ఉన్నారన్నారు. తిరుపతి పట్టణంలో ప్రతి ఒక్కరికి ఇల్లు కట్టిస్తానని చెప్పి ఇప్పటి వరకు ఒక్క ఇల్లు కూడా కట్టించలేదని మండిపడ్డారు. మహానేత వైయస్‌ఆర్‌ దామినేడు, అవిలాలలో 5 వేలకు పైగా నిరుపేదలకు ఇళ్లు కట్టించారని గుర్తు చేశారు. అందరి జీవితాలు బాగు చేస్తానని ఎన్నికల ముందు చెప్పిన చంద్రబాబు ప్రజలను నమ్మించి నట్టేట ముంచాడని ధ్వజమెత్తారు.

Back to Top