రాజ‌ధాని ప్రాంతంలో జ‌నాగ్ర‌హం

అమ‌రావ‌తి) రాజ‌ధాని ప్రాంతంలో సీ ఆర్ డీ ఏ అధికారులు, తెలుగుదేశం నాయ‌కుల నిర్వాకం మీద ప్ర‌జ‌ల్లో ఆగ్ర‌హం వ్య‌క్తం అవుతోంది. గ‌తంలో భూ సేక‌ర‌ణ కింద పొలాలు ఇచ్చిన రైతుల‌కు కూడా భూ స‌మీక‌ర‌ణ కు నోటీసులు అందాయి. అస‌లే కౌలు చెక్కుల తిర‌కాసుల‌తో రైతులు మండిపోతూ ఉన్నారు. దీంతో పంచాయ‌తీ కార్యాల‌యానికి వ‌చ్చిన అధికారుల్ని రైతులు నిల‌దీశారు. స‌రైన స‌మాధానం రాక‌పోవ‌టంతో అధికారుల్ని పంచాయతీ కార్యాల‌యంలో  ఉంచి తాళాలు వేశారు. చివ‌ర‌కు ఉన్న‌తాధికారుల జోక్యం తో విడిచి పెట్టారు. 
Back to Top