ప్రజల కోసం, రాష్ట్ర భవిష్యత్తు కోసం

 • గడపగడపలో ఒకే నినాదం వైయస్సార్ కాంగ్రెస్
 • ఇది తెలుగు ప్రజల నమ్మకానికి ప్రతిరూపం
 • ప్రతి గడపకు వెళ్తాం..బాబు దోపిడీని ఎండగడుతాం
 • బాబు ఎన్నికల్లో ఇచ్చిన హామీలను విస్మరించారు
 • రెండేళ్ల పాలనపై  వందప్రశ్నలతో ప్రజాబ్యాలెట్ నిర్వహిస్తాం
 • వైయస్సార్సీపీ పోరాటాలను ప్రతి ఇంటికీ తీసుకెళ్తాం
 • వైయస్సార్సీపీ సీనియర్ నేత, ఎమ్మెల్యే పెద్దిరెడ్డి

 • హైదరాబాద్ః ఎన్నికల్లో ఇచ్చిన హామీలను విస్మరించి చంద్రబాబు ప్రజలను మోసం చేశారని వైయస్సార్సీపీ సీనియర్ నేత, ఎమ్మెల్యే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి మండిపడ్డారు. బాబు అవినీతి, మోసపూరిత పాలనను ఎండగట్టేందుకు జూలై 8వ తేదీ నుంచి ఐదునెలల పాటు గడపగడపకు వైయస్సార్ కాంగ్రెస్ నినాదంతో ప్రజల వద్దకు వెళ్లాలని పార్టీ నిర్ణయించినట్లు పెద్దిరెడ్డి తెలిపారు. హైదరాబాద్ లో పార్టీ కేంద్ర కార్యాలయంలో జరిగిన మీడియా సమావేశంలో పెద్దిరెడ్డి మాట్లాడారు. గడపగడపకూ వైయస్సార్ కాంగ్రెస్ కార్యక్రమ వివరాల్ని తెలియజేశారు. ఇందుకు సంబంధించిన కరపత్రాన్ని మీడియాకు  విడుదల చేశారు. 

  ప్రజల కోసం, రాష్ట్ర భవిష్యత్తు కోసం అధ్యక్షులు వైయస్ జగన్ ఆధ్వర్యంలో గడపగడపకు వైయస్సార్ కాంగ్రెస్ కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించనున్నట్లు పెద్దిరెడ్డి చెప్పారు.  ప్రతి ఇంటికి కరపత్రం అందించి ప్రజల అభిప్రాయాలు తెలుసుకోనున్నట్లు ప్రకటించారు. రైతులకు, డ్వాక్రామహిళలకు రుణమాఫీ అన్నారు. బంగారు రుణాలు వెనక్కిఇస్తామన్నారు. ఇంటికో ఉద్యోగం, లేనిపక్షంలో నిరుద్యోగభృతి, 3 సెంట్ల స్థలం, లక్షన్నరతో పక్కా ఇళ్లు నిర్మిస్తామన్న చంద్రబాబు ఏ ఒక్కటీ చేయలేదని పెద్దిరెడ్డి దుయ్యబట్టారు. ప్రత్యేకహోదా గురించి తిరుపతి సభ మొదలు అనేక చోట్ల చంద్రబాబు, వెంకయ్యనాయుడులు పదేళ్లు కాదు పదిహేనేళ్లు అని గొప్పలు చెప్పారన్నారు.  చంద్రబాబు చేసిన తప్పుడు వాగ్ధానాలను ప్రతి ఇంటికీ తీసుకెళ్లి వివరిస్తామన్నారు. 

  బాబు రెండేళ్ల పాలనకు సంబంధించి  నూరు ప్రశ్నలతో కూడిన ప్రజాబ్యాలెట్ ను ప్రతి ఇంటికీ తీసుకెళ్తామన్నారు. బాబు పాలనపై మార్కులు వేయాలని కోరతామన్నారు. రెండేళ్లలో ఎన్నికల హామీలు నెరవేర్చకపోగా అత్యధిక ఉత్సాహంతో చంద్రబాబు చేసిన దోపిడీని ఎంపరర్ ఆఫ్ కరప్షన్ పేరుతో ఇప్పటికే పుస్తకాలు పంపిణీ చేయడం జరిగిందని పెద్దిరెడ్డి చెప్పారు. రూ.  లక్షా 45, 549 కోట్ల మేర జరిగిన దోపిడీ  వివరాలను పాంప్లెట్ లో పొందుపర్చామన్నారు. వాటిని శాసనసభ్యులు, నియోజకవర్గ కోఆర్డినేటర్లు  ప్రతి ఇంటికీ అందిస్తారని పెద్దిరెడ్డి స్పష్టం చేశారు. జూలై 8న దివంగత మహానేత వైయస్ రాజశేఖరరెడ్డి జయంతిని ఘనంగా నిర్వహించాలని నిర్ణయించినట్టు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి చెప్పారు. ఆ రోజున వైయస్సార్ విగ్రహాలకు నివాళులర్పించి, జెండాలు ఆవిష్కరించాలని పార్టీ నాయకులకు సూచించారు.

  గడపగడపకు వైయస్సార్ కాంగ్రెస్ కార్యక్రమాన్ని వైయస్ ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారని పెద్దిరెడ్డి చెప్పారు. ఐదునెలల్లో ఈకార్యక్రమాన్ని పూర్తి చేయాలని పార్టీ కార్యవర్గ సమావేశం నిర్ణయించింది. మంచి ఫలితాలు వస్తాయని భావిస్తున్నామని పెద్దిరెడ్డి తెలిపారు. నియోజకవర్గాలోని స్థానిక సమస్యలను తెలుసుకొని....వైయస్సార్సీపీ అధికారంలోకి వచ్చాక వాటిని నెరవేరుస్తుందని ప్రజల్లో భరోసా కల్పిస్తామన్నారు. బాబు దోపిడీని, అదేవిధంగా ఈరెండేళ్లలో వైయస్సార్సీపీ చేసిన ప్రజాపోరాటాలను ప్రజల వద్దకు తీసుకెళ్తామన్నారు. ఈకార్యక్రమాన్ని ప్రతి ఒక్కరూ విజయవంతం చేయాలని పెద్దిరెడ్డి సూచించారు. గడపగడపకు వైయస్సార్ కాంగ్రెస్ పై ప్రతిరోజూ రాష్ట్ర, జిల్లా స్థాయిలో మానిటరింగ్ చేస్తామన్నారు. 

Back to Top