పార్కు అభివృద్ధికి నిధులు కేటాయించండి

నెల్లూరు నగరంలోని స్వతంత్ర పార్కులో రూ.65 లక్షలతో జరుగుతున్న అభివృద్ధి పనులను మున్సిపల్ కార్పొరేషన్ డిప్యూటీ మేయర్ ద్వారకానాథ్ తో కలిసి  ఎమ్మెల్యే అనిల్ కుమార్ యాదవ్ పరిశీలించారు. ఈ సందర్భంగా అనిల్ కుమార్ యాదవ్ మాట్లాడుతూ...50 ఏళ్ల కింద నిర్మించిన స్వంతంత్ర పార్కు ప్రస్తుతం శిథిలావాస్తకు చేరుకుందని అన్నారు. 2014లో పార్కు అభివృద్ధి కోసం రూ,65 లక్షలు కేటాయించారని...టీడీపీ అధికారంలోకి వచ్చి మూడేళ్లయినా ఇంతవరకు అభివృద్ధికి నోచుకోలేదని ఫైర్ అయ్యారు. 

బిల్లులు రానందునే సగం సగం పనులు చేయాల్సి వస్తుందని కాంట్రాక్టర్లు చెబుతున్నారని..ఇప్పటికైనా ప్రభుత్వం పూర్తిస్థాయిలో నిధులు మంజూరు చేయాలని డిమాండ్ చేశారు. ప్రతి పనికి రేటు కట్టే కార్పొరేషన్ కార్యాలయంలో అవినీతిని నిరోధించాలని మేయర్, అధికారులు శపథం చేయడం హాస్యాస్పదమన్నారు. చేసిన ప్రమాణానికి కట్టుబడి...రాజకీయాలకతీతంగా అభివృద్ధి పనులు చేయాలని అధికారులకు సూచించారు. 
Back to Top