నాణ్యమైన రొయ్య మేత అందజేయాలి

 ఆకివీడు: డెల్టా ప్రాంతంలో రొయ్యల సాగు రోజు రోజుకూ పెరుగుతుందని, దీనిని దృష్టిలో పెట్టుకుని నాణ్యమైన మేతను రైతులకు అందుబాటులోకి తీసుకురావాలని వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ మండల యువజన కమిటీ అధ్యక్షుడు అంబటి రమేష్‌ వ్యాపారులకు సూచించారు. స్థానిక శాంతి కాంప్లెక్స్‌లో సోమవారం యూనిబెయిట్‌ రొయ్యల మేత కొనుగోలును ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా రమేష్‌ మాట్లాడుతూ వనామి సాగులో లాభాలున్నప్పటికీ నష్టాలు కూడా అధికంగా ఉంటున్నాయన్నారు. నాణ్యమైన సీడు, మేత వినియోగించాల్సి వస్తుందన్నారు. రైతులకు సాంకేతిక సలహాలను కూడా ఇవ్వాలన్నారు. కార్యక్రమంలో పార్టీ నాయకులు జిఎన్‌వి.సత్యనారాయణ, లోకేష్‌ కృష్ణంరాజు, కె.బలరామరాజు, పెద్దిరాజు, శ్రీరామరాజు, మోటుపల్లి ప్రసాద్, గొంట్లా గణపతి, తోట వాసు పలువురు రైతులు, వ్యాపారులు పాల్గొన్నారు
Back to Top