టీడీపీ నేత‌ల అక్ర‌మాల‌కు అడ్డుక‌ట్ట‌

వైఎస్సార్ జిల్లా: అధికార పార్టీ నాయ‌కుల అండ‌దండ‌లున్నాయి మాకేంటి అడ్డు అన్న చందంగా మారింది ప‌చ్చ‌చొక్కా త‌మ్ముళ్ల‌ ప‌రిస్థితి. కానీ వంద‌గుడ్ల‌ను తిన్న రాబందు అయిన ఒక్క గాలివాన‌కు నేల‌కు ఒర‌గాల్సిందేన‌న్న సామెత తెలుగు త‌మ్ముళ్ల‌కు తెలిసి ఉండ‌దేమో... ఆదివారం వారికి అలాంటి ప‌రిస్థితే ఎదురైంది. వివ‌రాల్లోకి వెళ్లితే .. వైఎస్సార్ జిల్లా ఎర్ర‌గుంట్ల‌లో టీడీపీ నేతలు ఇసుక‌ను అక్ర‌మంగా ర‌వాణా చేస్తుండ‌టంతో ఆగ్రహించిన గ్రామ‌స్తులు అడ్డుకున్నారు. దీంతో ఒక్క‌సారిగా గ్రామంలో ఉద్రిక్త వాతావ‌ర‌ణం నెలకొంది. దీంతో అధికార పార్టీ ఎంపీ సీఎం ర‌మేష్ సోద‌రుడు సురేష్‌, టీడీపీ నాయ‌కులు రంగంలోకి దిగారు. ఆ గ్రామ‌స్తుల‌ను భయ‌పెట్టే ప్ర‌య‌త్నం చేశారు. కాగా ఈ విష‌యం తెలుసుకున్న వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయ‌కుడు డాక్ట‌ర్ సుధీర్‌రెడ్డి సంఘ‌ట‌న స్థ‌లానికి చేరుకున్నారు. గ్రామ‌స్తుల‌కు బాస‌ట‌గా నిలిచారు. ఈలోగా పోలీసులు రంగ ప్ర‌వేశం చేసి ప‌రిస్థితిని అదుపు చేశారు. 
Back to Top