కిడారికి వ్యతిరేకంగా నిరసన ర్యాలీ

విశాఖపట్నంః కిడారికి వైఎస్సార్సీపీ కార్యకర్తలు షాకిచ్చారు. స్వార్ధ ప్రయోజనాలకోసం టీడీపీ పంచన చేరిన అరకు ఎమ్మెల్యేకి వ్యతిరేకంగా వైఎస్‌ఆర్‌సీపీ కార్యకర్తలు పెద్ద ఎత్తున  ఆందోళనకు దిగారు. సర్వేశ్వర్ రావు పార్టీ మారడం పట్ల స్థానిక వైఎస్సార్సీపీ కార్యకర్తలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.  కిడారి ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తూ పెద్ద ఎత్తున కార్యకర్తలు ర్యాలీ తీశారు. వైఎస్‌ఆర్‌సీపీ తరపున ఉన్నాడని.. ప్రజలు కిడారి సర్వేశ్వరరావును గెలిపిస్తే, ప్రజలను వంచిస్తూ ఆయన టీడపీలో చేరడం దుర్మార్గమని మండిపడ్డారు.

Back to Top