ఎండిపోతున్న పంటలను కాపాడండి

రాయచోటిః  వెలిగల్లు కాలువ పరిధిలోని పంట పొలాలకు నీరందించేందుకు తగు చర్యలు తీసుకోవాలని వైఎస్సార్సీపీ ఎమ్మెల్యే గడికోట శ్రీకాంత్ రెడ్డి అధికారులను ఆదేశించారు. కొందరు స్వప్రయోజనాల కోసం ఎక్కడిక్కడ కాలువలకు గండ్లు కొట్టడంతో...చేతికొచ్చిన పంటలు నీరందక ఎండిపోతున్నాయన్నారు. గండ్లను పూడ్చి కాలువల ద్వారా ఆ పొలాల పరిధిలోని చెరువలకు నీరందించాలని అధికారులకు సూచించారు. లక్కిరెడ్డిపల్లె మండలంలోని కోనపేటలో అనారోగ్యంతో బాధపడుతున్న శంకర్ రెడ్డిని గడికోట పరామర్శించారు. ఆయనతో పాటు జడ్పీటీసీ సభ్యుడు సుదర్శన్ రెడ్డి, ఎంపీపీ రెడ్డెయ్యలు శంకర్ రెడ్డిని పరామర్శించారు. 

To read this article in English:   http://goo.gl/384n0Y 


Back to Top