మా నాయ‌కుడివి నీవే అన్నా..



-  వైయ‌స్ జ‌గ‌న్‌కు అడుగ‌డుగునా బ్ర‌హ్మ‌ర‌థం ప‌ట్టిన జిల్లావాసులు
-  అన్నా..నీవే మా దిక్కు అంటూ వేడుకోలు
- దారి పొడ‌వునా బాధ‌లు చెప్పుకున్న క‌రువు జిల్లా ప్ర‌జ‌లు
- మంచి రోజులు వ‌స్తాయ‌ని ధైర్యం చెప్పిన‌ జ‌న‌నేత 
-  తొమ్మిది నియోజకవర్గాలు, 176 గ్రామాలు
-  ఎనిమిది బహిరంగ సభలు, నాలుగు సదస్సులు
 అనంత‌పురం:  ప్ర‌జా స‌మ‌స్య‌లు తెలుసుకునేందుకు వైయ‌స్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్య‌క్షులు వైయ‌స్ జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి చేప‌ట్టిన ప్ర‌జా సంక‌ల్ప యాత్ర దిగ్విజ‌యంగా సాగుతోంది. న‌వంబ‌ర్ 6న వైయ‌స్ఆర్ జిల్లా ఇడుపుల‌పాయ నుంచి ప్రారంభ‌మైన పాద‌యాత్ర వైయ‌స్ఆర్ జిల్లా, క‌ర్నూలు జిల్లాలు పూర్తి చేసుకొని డిసెంబ‌ర్ 4న అనంత‌పురం జిల్లాలోకి అడుగుపెట్టింది. జిల్లాలో 20 రోజుల పాటు 9 నియోజ‌క‌వ‌ర్గాల్లో 176 గ్రామాల‌లో వైయ‌స్ జ‌గ‌న్ పాద‌యాత్ర చేసి ప్ర‌జ‌ల స‌మ‌స్య‌లు తెలుసుకున్నారు. జిల్లాలో 8 బ‌హిరంగ స‌భ‌లు, నాలుగు స‌ద‌స్సులు, గ్రామాల్లో ప్ర‌జ‌ల‌తో మ‌మేక‌మై క‌రువు జిల్లా ప్ర‌జ‌ల క‌ష్టాలు తెలుసుకొని, క‌న్నీళ్లు తుడిచారు. రాజన్న బిడ్డ వ‌స్తున్నాడ‌ని గ్రామాల‌కు గ్రామాలు ప‌నులు మానుకొని ఎదురు చూశారు. జ‌న‌నేత‌పై అంతులేని, అనంత ఆప్యాయ‌త చూపారు.  రహదారులు పూల పాన్పులయ్యాయి.. వీధులు జనంతో కిక్కిరిశాయి.. బహిరంగ సభలైతే ఇసుక వేస్తే రాలనంతంగా జనసంద్రాలుగా మారాయి.. మా రాజన్న బిడ్డొచ్చాడని అవ్వాతాతలు, మా అన్న.. మా తమ్ముడొచ్చాడని అక్కచెల్లెమ్మలు.. యువకులు రోడ్లపైకి వచ్చారు.. ఒక్కమాటలో చెప్పాలంటే ఊళ్లకు ఊళ్లే తరలి వచ్చి ఘన స్వాగతం పలికాయి.. కరచాలనం చేయాలని, సెల్ఫీ దిగాలని, ఒక్కమాటైనా కలపాలని, నాలుగడుగులు వేయడానికి పోటీపడ్డారు. ‘అన్నా.. ఈ ప్రభుత్వంలో ఒక్క ఉద్యోగమూ రాలేద’ని నిరుద్యోగులు.. ‘మమ్మల్ని నానా ఇక్కట్లకు గురి చేస్తున్నార’ని ఉద్యోగులు.. ‘రుణ మాఫీ చేస్తామని నమ్మించి నిండా ముంచార’ని డ్వాక్రా అక్కచెల్లెమ్మలు, రైతులు వారి బాధను వెళ్లగక్కారు.. పండుటాకులపై ఇసుమంతైనా కనికరం లేకుండా ఉన్న పింఛన్లను కూడా పీకేశారని వృద్ధులు గోడు వెళ్లబోసుకున్నారు.. వైయ‌స్ జగన్‌ అందరి కష్టాలూ ఓపిగ్గా విన్నారు.. వారి కన్నీళ్లు తుడిచారు.. మనందని ప్రభుత్వం వచ్చాక అందరి కష్టాలు తీరుస్తానని హామీ ఇచ్చారు.. మరోసారి మోసపోమని, మేమంతా మీ వెంటే ఉంటామని , మా నాయ‌కుడిని నీవే అని జిల్లా ప్ర‌జ‌లు నిన‌దించారు. 

కొండంత భ‌రోసా
క‌రువుతో అల్లాడుతున్న అనంత‌పురం జిల్లా ప్ర‌జ‌ల‌కు వైయ‌స్ జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి కొండంత భ‌రోసా క‌ల్పించారు. తమ కష్టాలు విని, తీర్చే నాయకుడొచ్చారని వయస్సుతో నిమిత్తం లేకుండా పిల్లలు, పెద్దలు భారీగా తరలి వచ్చి ప్ర‌జా సంక‌ల్ప యాత్ర‌కు మ‌ద్ద‌తు తెలిపారు.  జననేత అడుగులో అడుగు వేసి ముందుకు సాగారు.  ఊహకు అందని విధంగా, ఇసుక వేస్తే రాలనంత జనం బ‌హిరంగ స‌భ‌ల‌కు హాజ‌రు కావ‌డంతో టీడీపీ నేత‌ల్లో క‌ల‌వ‌రం మొద‌లైంది. వైయ‌స్ జగన్‌ శింగనమల నియోజకవర్గం గుమ్మేపల్లిలో 400 కిలోమీటర్లు, ధర్మవరం నియోజకవర్గం గొట్లూరులో 500 కిలోమీటర్లు, కదిరి నియోజకవర్గం కటారుపల్లి క్రాస్‌ వద్ద 600 కిలోమీటర్ల మైలు రా
Back to Top