నవ రత్నాలపై గ్రామస్థాయిలో ప్రచారం చేయాలి: పెద్దిరెడ్డి

రొంపిచెర్ల: వైయస్‌ఆర్‌సీపీ అధ్యక్షుడు వైయస్‌.జగన్‌మోహన్‌రెడ్డి ప్రకటించిన నవరత్నాలుపై గ్రామస్థాయిలో బూత్‌ కమిటీ సభ్యులు ప్రచారం చేయాలని పుంగనూరు ఎమ్మెల్యే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి అన్నారు. ఎమ్మెల్యే రామచంద్రారెడ్డి బుధవారం రొంపిచెర్ల మండలంలో పర్యటించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ మూడేళ్ల చంద్రబాబు పాలనలో ప్రజలకు ఒరిగింది ఎమి లేదన్నారు. ప్రజా పాలనలో విఫలమైన సీఎం చంద్రబాబు మళ్లీ ప్రజలను మోసం చేసేందుకు వస్తున్నారని తెలిపారు. టీడీపీ పార్టీని బంగాళాఖాతంలో కలిపే రోజులు దగ్గరలోనే ఉన్నాయని విమర్శించారు. పేదల అభివృద్థి కోసం వైయస్‌ జగన్‌ 9 పథకాలను ప్రకటించారని గుర్తు చేశారు. వీటిపైన గ్రామాలలో కార్యకర్తలు విసృత ప్రచారం చేయాలని కోరారు. రొంపిచెర్లలో గుండెపోటుతో మృతి చెందిన మాజీ ఎమ్మెల్యే సైపూల్లా బేగ్‌ సోదరుడు ఇనాయతుల్లాబేగ్‌ కటుంబ సభ్యులను పరమర్శించారు. తనకు ఇనాయతుల్లాబేగ్‌ అప్త మిత్రుడని కొని యాడారు. యన కుటుంబ సభ్యులకు తాను అండగా ఉంటానని తెలియజేశారు. అలాగే అనారోగ్యంతో బాద పడుతున్న అహ్మద్‌అలీబేగ్, హబిబుల్లాబేగ్‌లను పరమర్శించారు. వారి ఆరోగ్యం గురించి అడిగి తెలుసుకోన్నారు. మోటుమల్లెల నగిరిలో కాన్సర్‌ వ్యాధితో మృతి చెందిన ఉపాధ్యాయుడు రమేష్‌నాయుడు కర్మక్రియలకు హాజరు అయ్యారు. 

Back to Top