ప్రాజెక్టులు వైయస్‌ఆర్‌ పుణ్యమే

  • వైయస్ఆర్ చేపట్టిన ప్రాజెక్ట్ ల ముందు బాబు ఫోజులు
  • యాంకర్, చీఫ్ గెస్ట్, స్పీకర్ అన్నీ బాబే
  • లోకల్ ఎమ్మెల్యేకు మైక్ ఇవ్వకుండా నిర్ధాక్షిణంగా లాక్కున్నాడు
  • చంద్రబాబు వల్లే రైతుల ఆత్మహత్యలు
  • అన్నదాతకు అండగా వైయస్ జగన్
కర్నూలు(శ్రీశైలం)) ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో నిర్మిస్తున్న ప్రాజెక్టులన్నీ కూడా దివంగత ముఖ్యమంత్రి వైయస్‌ రాజశేఖరరెడ్డి పుణ్యమే అని నందికొట్కూరు ఎమ్మెల్యే ఐజయ్య పేర్కన్నారు. గురువారం శ్రీశైలం ప్రాజెక్ట్‌ వద్ద ఆయన విలేకరులతో మాట్లాడారు..జనవరి 2న ముచ్చుమ్రరి ఎత్తిపోతల పథకం ప్రారంభ సభలో జరిగిన సన్నివేశాలను ఆయన మీడియాతో పంచుకున్నారు. ఏమన్నాకో ఎమ్మెల్యే మాటాల్లోనే..ముచ్చుమ్రరి సభలో స్పీకర్, చీఫ్‌ గెస్ట్, యాంకర్‌ అన్నీ చంద్రబాబే చేస్తూ ఎవరికీ మాట్లాడేందుకు అవకాశం ఇవ్వలేదని ఎద్దేవా చేశారు. ఎక్కడైనా లోకల్‌ ఎమ్మెల్యే సభకు అధ్యక్షత వహిస్తారు. సభ ప్రారంభం నుంచి అయిపోయే వరకు చంద్రబాబే రెండు గంటలు మాట్లాడారు. ఇదెక్కడి న్యాయం..?తనకు మాట్లాడేందుకు సమయం ఇప్పించాలని కలెక్టర్‌ను కోరినా..తనకేం తెలియదు..అంతా సీఎం చూసుకుంటున్నారని సమాధానం చెప్పారు. తనకు మాట్లాడేందుకు అవకాశం ఇవ్వకుండా టీడీపీ ఇన్‌చార్జ్‌ మాండ్ర శివానందరెడ్డికి మైక్‌ ఇస్తుంటే..సార్‌ నేను లోకల్‌ ఎమ్మెల్యేను, నాకు మాట్లాడేందుకు మైక్‌ ఇవ్వాలని కోరాను. అయితే సీఎం ఒప్పుకోకుండా..తమ్ముడు మీరూ లోకల్‌ ఎమ్మెల్యే కావచ్చు. అయినాసరే మీకు భాగస్వామ్యం లేదని అడ్డుకున్నారు. భాగస్వామ్యమంటే ఏంటన్నా..ఫంక్షన్‌లో భాగస్వామ్యమా? లేక ముచ్చుమ్రరి ఎత్తిపోతల కమీషన్లలో భాగస్వామ్యమా? అర్థం కాలేదు. తమ్ముడు మీరు పట్టిసీమను అడ్డుకున్నారు కాబట్టి మీ నాయకుడికి, మీకు మాట్లాడేందుకు అవకాశం ఇవ్వమని సీఎం చెప్పారు. చివరగా నాకు రెండు నిమిషాలు సమయం ఇవ్వడంతో థాంక్స్‌ చెప్పినట్లే చెప్పి..ఇక అసలు విషయం చెప్పాను. ముచ్చుమ్రరి ఎత్తిపోతల దివంగత మహానేత వైయస్‌ రాజశేఖరరెడ్డి పుణ్యమే. ఆయన హయాంలో 80 శాతం పనులు పూర్తి చేశారు. ఈ ప్రాజెక్ట్‌కు వైయస్‌ఆర్‌ పునాది వేశారు కాబట్టి ఆయనే అసలు సూత్రదారి అన్నాను. పోలవరం ప్రాజెక్ట్‌ కూడా వైయస్‌ఆర్‌ భిక్షనే అనే సరికి చంద్రబాబు ముఖం మాడిపోయింది. ఆ కోపంతో మైక్‌ కట్‌ చేశారని ఐజయ్య అన్నారు. 

వైయస్‌ జగన్‌ రాక కోసం వేయికళ్లతో ఎదురుచూపు
వైయస్‌ఆర్‌సీపీ రాష్ట్ర కార్యదర్శి బీవై రామయ్య
శ్రీశైలం: వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షులు, ఏపీ ప్రతిపక్ష నేత వైయస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డి రాకకోసం కర్నూలు జిల్లా ప్రజలు వేయి కళ్లతో ఎదురు చూస్తున్నారని వైయస్‌ఆర్‌సీపీ రాష్ట్ర కార్యదర్శి బీవై రామయ్య అన్నారు. రైతు భరోసా యాత్రలో పాల్గొనేందుకు గురువారం వైయస్‌ జగన్‌ జిల్లాలోని శ్రీశైలం ప్రాజెక్టు వద్దకు చేరుకున్నారు. ఈ సందర్భంగా జననేతకు స్వాగతం పలికేందుకు వచ్చిన బీవై రామయ్య మీడియాతో మాట్లాడారు. ఆయన ఏమన్నారంటే రామయ్య మాటల్లోనే.. జనవరి 2న జిల్లాకు సీఎం వచ్చి పోయారు. 2014లో ఆయనే రుణమాఫీ చేస్తామన్నారు. బ్యాంకులో ఉన్న బంగారం ఇంటికి తెప్పిస్తామని హామీ ఇచ్చారు. కానీ, రైతులు పండించిన పంటకు గిట్టుబాటు ధర లేదు. మద్దతు ధర గురించి ప్రభుత్వం పట్టించుకోవడం లేదు. చంద్రబాబుకు ఎంతసేపు ఓట్లపైనే ధ్యాస. రైతులు పడుతున్న కష్టాలు ఏమాత్రం పట్టడం లేదు. జనవరి 2న జిల్లాకు వచ్చిన సీఎం చంద్రబాబు రైతులకు తాను ఈ మేలు చేస్తున్నానని ప్రకటించకపోవడం దురదృష్టకరం. నాడు దివంగత ముఖ్యమంత్రి వైయస్‌రాజశేఖరరెడ్డి ప్రారంభించిన ప్రాజెక్టులను ఇవాళ చంద్రబాబు ఓపెన్‌ చేస్తూ..తానేదో ఘనకార్యం చేసినట్లు ఫోజులు కొడుతున్నారు. రైతులు కన్నీళ్లు పెట్టుకుంటుంటే..ఉన్నవాళ్ల మధ్య గొడవలు ఎలా సృష్టించాలన్నదే టీడీపీ నేతల పని. వర్షాభావ పరిస్థితులు, రైతుల ధీనావస్థలో ఉన్న తరుణంలో వారిలో ధైర్యం నింపేందుకు ఇవాళ వైయస్‌ఆర్‌సీపీ అధినేత వైయస్‌ జగన్‌మోహన్‌రెడ్డి కర్నూలు జిల్లాలో రైతు భరోసా యాత్రకు శ్రీకారం చుట్టారు. అప్పుల బాధ తాళలేక ఆత్మహత్య చేసుకున్న కుటుంబాలను ఓదార్చే నాథుడు లేడు. ఈ పరిస్థితుల్లో నేనున్నానని భరోసా ఇచ్చేందుకు వైయస్‌ జగన్‌ ముందుకు వచ్చారు. దివంగత ముఖ్యమంత్రి వైయస్‌ రాజశేఖరరెడ్డి పాలనలో ఎలాంటి స్వర్ణయుగం చూశామో..రాబోయే రోజుల్లో అలాంటి పాలన తెచ్చుకుందామని ధైర్యం చెప్పేందుకు వైయస్‌ జగన్‌ వస్తున్నారు. జిల్లా ప్రజలందరూ వైయస్‌ జగన్‌ రాకకోసం వెయ్యి కళ్లు పెట్టుకొని ఎదురుచూస్తున్నారు. ఎప్పుడెప్పుడు ఆయన సీఎం సీట్లో కూర్చుంటే మాకు మేలు జరుగుతుందా అని ప్రజలు ఆశగా ఎదురు చూస్తున్నారు. ఇవాళ చంద్రబాబు ఒక కొత్త ప్రాజెక్టు కూడా తీసుకురాలేదు. దివంగత ముఖ్యమంత్రి వైయస్‌ రాజశేఖరరెడ్డి హయాంలో దాదాపు పూర్తయిన ప్రాజెక్టులను మిగిలిన 10 శాతం, 5 శాతం పనులు పూర్తి చేసేందుకు చంద్రబాబుకు మూడేళ్ల సమయం పట్టింది. అది కూడా అరకొరనే. ముచ్చుమ్రరి ఎత్తిపోతల ప్రాజెక్టులో నాలుగు పంపులు పనిచేయాల్సి ఉండగా రెండు పంపులతో నీళ్లు చిలకరించి తానేదో ఉద్దరించినట్లు ఫోజు కొడుతున్నారు. జిల్లాకు బాబు కొత్తగా ఒరగబెట్టింది ఏమీ లేదు. పట్టిసీమ కూడా కేవలం టీడీపీ నేతల కమీషన్ల కోసమే చేపట్టారు. పోలవరం రైట్‌ బ్రాంచ్‌ కెనాల్‌ను వైయస్‌ఆర్‌ 80 శాతం పూర్తి చేశారు. చంద్రబాబు ఈ కాల్వలో నీళ్లు తోడిపోసి నదులు అనుసంధానం చేశానని గొప్పలు చెప్పుకుంటున్నారు. బాబుకు నిజంగా చిత్తశుద్ధి ఉంటే పట్టిసీమ ద్వారా 44 టీఎంసీలు రాయలసీమకు ఇస్తామన్నారు. దానికి సంబంధించిన జీవో ఎందుకు ఇవ్వడం లేదు. నాడు మహానేత వైయస్‌ఆర్‌ దూరదృష్టితో జీవో 196 ద్వారా 798 అడుగుల నీటిమట్టం ఉండగానే ముచ్చుమ్రరికి నీటిని పంపిణీ చేయవచ్చు అని తీర్మానించారు. ఇవాళ చంద్రబాబు కొత్త జీవో ఒక్కటి కూడా ఇవ్వలేదు. కొత్తగా ఉపయోగపడే కార్యక్రమం ఒక్కటి కూడా చేయలేదు. కొత్త ప్రాజెక్టులు బాబు ఎప్పుడు కట్టాలి. రాయలసీమకు నీళ్లు ఎప్పుడిస్తారు. ఈ పరిస్థితులు అందరికీ అర్థమవుతోంది. వైయస్‌ రాజశేఖరరెడ్డి పేరు ఎత్తగానే చంద్రబాబు తట్టుకోలేకపోతున్నారు. మనిషి షేక్‌ అయ్యి..ఉబ్బి తబ్బిబు అవుతున్నారు. వైయస్‌ జగన్‌ మోహన్‌రెడ్డికి బాబు ఎప్పుడు తట్టుకుంటారో?. ముచ్చుమ్రరి మీటింగ్‌లో ఎమ్మెల్యేను మాట్లాడనివ్వకుండా నిర్ధాక్ష్యణంగా మైక్‌ లాక్కున్నారు.

ధైర్యం చెప్పేందుకే వైయస్‌ జగన్‌ రైతు భరోసా యాత్ర
వైయస్‌ఆర్‌సీపీ రైతు విభాగం నాయకులు వంగాల భరత్‌రెడ్డి
శ్రీశైలం: అప్పుల  బాధ తాళలేక ఆత్మహత్య చేసుకున్న కుటుంబాలకు ధైర్యం చెప్పేందుకు వైయస్‌ఆర్‌సీపీ అధ్యక్షులు వైయస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డి రైతు భరోసా యాత్ర పేరుతో కర్నూలు జిల్లాకు వచ్చినట్లు వైయస్‌ఆర్‌సీపీ రైతు విభాగం నాయకులు వంగాల భరత్‌రెడ్డి తెలిపారు. శ్రీశైలం ప్రాజెక్ట్‌ వద్ద ఆయన మీడియాతో మాట్లాడారు. 2014 ఎన్నికల సమయంలో చంద్రబాబు రైతుల రుణాలు మాఫీ చేస్తామని హామీ ఇచ్చారు. అధికారంలోకి వచ్చాక పూర్తిగా రైతులకు అన్యాయం చేస్తున్నారు. బాబు మాటలు నమ్మిన రైతులు చేసిన అప్పులు తీర్చలేక ఆత్మహత్యలు చేసుకుంటున్న పరిస్థితుల్లో వైయస్‌ఆర్‌సీపీ అధ్యక్షులు, ఏపీ ప్రతిపక్ష నేత వైయస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డి తన వంతు బాధ్యతగా రైతులకు ధైర్యం చెప్పేందుకు రైతు భరోసా యాత్ర పేరుతో కర్నూలు జిల్లాకు రావడం శుభపరిణామం. రైతులకు మద్దతు ధర లేక ఇవాళ అన్ని విధాల నష్టపోయారు. రుణమాఫీ కాక అన్ని విధాల చితికిపోయారు. ఆత్మహత్యలకు ప్రేరేపిస్తున్న తరుణంలో మీరు భయపడవద్దని వైయస్‌ జగన్‌ ధైర్యం చెప్పేందుకు వస్తున్నారు. రానున్న రోజులు మనవే అన్న భరోసా నింపేందుకు ప్రతిపక్ష నేత వస్తున్నారు. జిల్లాకు వస్తున్న వైయస్‌ జగన్‌కు రైతుల తరఫున హృదయపూర్వక స్వాగతం పలుకుతున్నాం.

 
Back to Top