ఈశాన్యరాష్ట్రాలతో పోల్చడం అజ్ఞానమే

ఈశాన్యరాష్ట్రాల్లో ఏం అభివృద్ధి జరిగిందని ప్రత్యేక హోదా గురించి వితండవాదం చేసున్నారు. దానికి కారణాలు వేరే ఉన్నాయి. శాంతి భద్రతలు, భౌగోలిక సమస్యలు, రాజకీయ వాతావరణం తదితర సమస్యలు ఉన్నాయి. ఉక్కు ఫ్యాక్టరీలు, సిమెంట్‌ ఫ్యాక్టరీలు అక్కడ పెట్టడం కుదరదు. ఫార్మా పరిశ్రమలు పెట్టారు. అభివృద్ధి చేసుకున్నారు. విజయనగరం నుంచి ఒకే దూరంలో ఉన్న అరకు వ్యాలీ కన్నా విశాఖకే వస్తారు. కారణం విశాఖలోనే అన్ని వనరులు అందుబాటులో ఉండటమే. ఇప్పుడు అన్ని పార్టీలు సిద్ధంగానే ఉన్నాయి. ఇప్పుడు యాక్టును సిద్ధం చేయాలి. ఇప్పుడు విశాఖలో చాలా పరిశ్రమలు మూతపడే దుస్థితి దాపురించింది. ఈ పరిస్థితి నుంచి బయటపడి విద్యార్థుల భవిష్యత్‌ బంగారు మయం కావాలంటే ప్రత్యేక హోదా వచ్చితీరాలి. 
– ప్రభాకర్, మాజీ ప్రొఫెసర్‌
Back to Top