చంద్రబాబు అతి తో అనర్థాలు


ముఖ్యమంత్రి చంద్రబాబు వైఖరితో అనర్థాలు అధికంగా కనిపిస్తున్నాయి. ముఖ్యంగా
ఆయన ప్రచారపు పిచ్చి వరద పీడిత ప్రాంతాల ప్రజలకు చుక్కలు చూపిస్తోంది.

వరదలు శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా, వైఎస్సార్ జిల్లాలను
ముంచెత్తుతున్నాయి. వీటితో అనేక గ్రామాలు వరద నీటి పాలయ్యాయి. వేలాది ఎకరాల్లో పంట
నష్టం జరిగింది. ప్రభుత్వ యంత్రాంగం ఇప్పుడు వరద సహాయత చర్యల్ని ముమ్మరంగా
చేపట్టాల్సిన తరుణం. అవసరమైతే పక్క జిల్లాల నుంచి ప్రభుత్వ సిబ్బంది, అధికారుల్ని
పిలిపించి ఉధ్రతంగా సహాయ చర్యలు చేపట్టాలి.

ఈ లోగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నెల్లూరు జిల్లాలో పర్యటించాలని
నిర్ణయించారు. మీడియా ముందు అధికార యంత్రాంగం మీద హడావుడి చేయటానికి శ్రద్ధ
చూపించే చంద్రబాబు ఇక్కడ కూడా అదే వైఖరితో ఉన్నారు. దీంతో జిల్లాలోని ఉన్నతాధికారులు
సహాయ చర్యలు ఎక్కడకిక్కడే వదిలేసి అటు పరిగెత్తారు. శుక్రవారం అంతా ఆయన కూడా కూడా
తిరిగారు. శనివారం వేకువ జామునే గెస్ట్ హౌస్ దగ్గర వాలిపోయారు. సమాచారం, సహాయం
అందించేందుకు డివిజన్ స్థాయి అధికారులు పనుల్ని వదిలేసి గెస్టు హౌస్ కు దగ్గరల్లో
జిల్లా అధికారులకు అందుబాటులో నిలిచిపోయారు. సాయంత్రం దాకా ముఖ్యమంత్రి ఎటు
వెళతారో ముందస్తు సమాచారం లేక రోజున్నర పాటు ముఖ్యమంత్రి వెంటే ఉండిపోయారు. దీంతో
సహాయ చర్యల్ని పట్టించుకొనే నాథుడే లేకపోయాడు.

ఒక వైపు వరద ఉధ్రతిలో ప్రజలు అల్లాడిపోతుంటే ముఖ్యమంత్రి చుట్టూ అధికార
యంత్రాంగం ప్రదక్షిణలు చేస్తూ ఉండిపోయింది. దీంతో వరద బాదితులకు దేవుడే దిక్కుగా
నిలిచారు. ఈలోగా ప్రతిపక్ష వైఎస్సార్సీపీ పార్టీ నాయకులు, కార్యకర్తలు సహా కొన్ని
స్వచ్ఛంద సంస్థలు వరద బాధితులకు ఆసరాగా నిలిచారు. ఎక్కడికక్కడ వరద పీడిత
ప్రాంతాలకు చేరుకొని ఆహారం, తాగునీరు, మందుల్ని పంపిణీ చేశారు.

 

Back to Top