జనరంజక పాలన మళ్ళీ జగన్‌తోనే సాధ్యం

కడప:

జన రంజకమైన పరిపాలన దివంగత ముఖ్యమంత్రి, మహానేత డాక్టర్‌ వైయస్‌ రాజశేఖరరెడ్డి హయాంలో కొనసాగిందని వైయస్ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ గౌరవ అధ్యక్షురాలు శ్రీమతి వైయస్‌ విజయమ్మ అన్నారు. ‘ప్రజలకు కడుపు నిండా తిండి, విద్యార్థులకు ఉచిత విద్య, రోగులకు మంచి వైద్యం, మహిళలకు ఆర్థికాభివృద్ధి, కార్మికులకు ఉపాధి భద్రత‌ కల్పించడం వైయస్ఆర్‌కు మాత్రమే సాధ్యమయ్యాయన్నారు. సంక్షేమం, అభివృద్ధి రెండు కళ్లులా చూసుకుని ప్రపంచంలోనే ఆదర్శవంతమైన పాలన అందించిన ఘనత ఆయనదే అన్నారు. మళ్లీ అలాంటి పాలన జగన్‌బాబుతోనే సాధ్యం' అని శ్రీమతి విజయమ్మ పేర్కొన్నారు. వైయస్ఆర్ జిల్లా యర్రగుంట్ల, ప్రొద్దుటూరు, జమ్మలమడుగు, మోరగుడి, దొమ్మరనంద్యాల, వేపరాల, ముద్దనూరు ప్రాంతాల్లో ఆమె‌ శుక్రవారంనాడు ఎన్నికల ప్రచారం నిర్వహించారు.

ఈ సందర్భంగా శ్రీమతి విజయమ్మ మాట్లా డుతూ.. తొమ్మిదేళ్ల చంద్రబాబు పాలనలో రాష్ట్రంలో పేద, బడుగు, బలహీన వర్గాలు, రైతులు, కార్మికులు, ఉద్యోగులు అనేక అవస్థలు పడ్డారని గుర్తుచేశారు. పరిశ్రమలు మూతబడిపోవడంతో ఏడు లక్షల మంది కార్మికులు ఉపాధి కోల్పోయి రోడ్డున పడ్డారన్నారు. రాష్ర్టంలో చంద్రబాబు చీకటి పాలన చూశామని, తర్వాత ఐదేళ్ల మూడు నెలల పాటు రాజశేఖరరెడ్డి స్వర్ణయుగం చూశామని, అనంతరం కాంగ్రెస్ అస్తవ్యస్థ‌, అసమర్థ పాలన కూడా మనమంతా చూశామని అన్నారు. అన్ని పాంత్రాలనూ సమదృష్టితో అభివృద్ధి చేసిన ఘనత వైయస్‌దే అన్నారు. పన్నుల భారం లేకుండా ప్రజలకు సంక్షేమ పథకాలు అందించి అందరి హృదయాల్లో చిరస్థాయిగా రాజశేఖరరెడ్డి నిలిచిపోయారని శ్రీమతి విజయమ్మ పేర్కొన్నారు.

Back to Top