హైకోర్టులో ప్రైవేట్‌ కేసు దాఖలు

అనంతపురం: వైయస్‌ఆర్‌సీపీ రాష్ట్ర కార్యదర్శి పైలా నరసింహయ్య తాడిపత్రి రెవెన్యూ అధికారులపై హైకోర్టులో ప్రైవేట్‌ కేసు దాఖలు చేశారు. రెవెన్యూ అధికారుల తప్పుడు ఫిర్యాదుపై తాడిపత్రి కోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. తహశీల్దార్‌ యల్లమ్మ, ఆర్‌ఐ మల్లేష్‌పై 24 గంటల్లో కేసు నమోదు చేయాలని కోర్టు ఆదేశించింది. దళిత మహిళకు న్యాయం చేయాలంటూ వారం క్రితం తహశీల్దార్‌ కార్యాలయం వద్ద పైలా నరసింహయ్య ఆధ్వర్యంలో ధర్నా చేశారు. ఆ సమయంలో తహశీల్దార్‌ లేకపోవడంతో కార్యాలయంలో వినతిపత్రం ఇచ్చి వైయస్‌ఆర్‌సీపీ నాయకులు వెళ్లి పోయారు. తమ విధులకు ఆటంకం కలిగించారంటూ తహశీల్దార్‌ ఫిర్యాదు చేశారు. టీడీపీ ఎమ్మెల్యే జేసీ ప్రభాకర్‌రెడ్డి ఒత్తిడితో తమపై అక్రమ కేసు పెట్టారని పైలా నరసింహయ్య తాడిపత్రి కోర్టును ఆశ్రయించారు. 
 

తాజా ఫోటోలు

Back to Top