కార్పొరేట్‌ విద్యాసంస్థలు పీడిస్తున్నాయి

చిత్తూరు: కార్పొరేట్‌ విద్యాసంస్థలు తమను పీడిస్తున్నాయని ప్రైవేట్‌ టీచర్స్, లెక్చరర్స్‌ యూనియన్‌ సభ్యులు వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ అధినేత వైయస్‌ జగన్‌కు గోడు వెల్లబోసుకున్నారు. చంద్రగిరి నియోజకవర్గంలో కొనసాగుతున్న ప్రజా సంకల్పయాత్రలో వైయస్‌ జగన్‌ను ప్రైవేట్‌ టీచర్స్, లెక్చరర్స్‌ యూనియన్‌ సభ్యులు కలుసుకున్నారు. ఈ సందర్భంగా సెలవు రోజుల్లో కూడా తమతో పనులు చేయిస్తున్నారని ఉద్యోగులు ఆవేదన వ్యక్తం చేశారు. ఉద్యోగులు, విద్యార్థులపై మానసిక ఒత్తిడి పెరుగుతుందన్నారు. అదే విధంగా లెక్చరర్స్‌కి సరిగా జీతాలు కూడా ఇవ్వడం లేదని వైయస్‌ జగన్‌కు వినతిపత్రం అందజేశారు. ఈ మేరకు వారి సమస్యలు విన్న జననేత అధికారంలోకి రాగానే సమస్యలు పరిష్కరిస్తానని హామీ ఇచ్చారు. 
Back to Top