ప్రత్యేకహోదా కోసం ప్రైవేటు మెంబర్ బిల్లు

న్యూఢిల్లీ:  ఆంధ్రప్రదేశ్ కు ప్రత్యేక హోదాపై వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తన పోరాటాన్ని కొనసాగిస్తోంది. పార్టీ ఎంపీ వైవీ సుబ్బారెడ్డి లోక్ సభలో ఏపీకి ప్రత్యేక హోదా కోసం ప్రవేట్ మెంబర్ బిల్లును ప్రవేశపెట్టనున్నారు. లోక్ సభ బిజినెస్ లో 9వ ఐటమ్ గా ఆ బిల్లు లిస్ట్ అయింది.

అలాగే పున‌ర్ విభ‌జ‌న చ‌ట్టంలో ఇచ్చిన హ‌మీల‌ కోసం  సభలో ​ప‌ట్టుబ‌డ‌తామ‌ని, పోల‌వ‌రం, రైల్వే జోన్ స‌హా అన్ని అంశాల‌ను పార్లమెంట్‌లో లేవ‌నెత్తనున్నట్లు పార్టీ ఎంపీలు తెలిపారు. ప్రత్యేక హోదాతోనే రాష్ట్రం అభివృద్ధి చెందుతుందని అన్నారు. కాగా పార్లమెంట్‌ శీతాకాల సమావేశాలు బుధవారం నుంచి ప్రారంభమైన విషయం తెలిసిందే.

Back to Top