అనర్హతపై రాజ్యసభలో ప్రైవేటు మెంబర్ బిల్లు

న్యూఢిల్లీ: వైయస్సార్సీపీ రాజ్యసభ సభ్యుడు వి. విజయసాయిరెడ్డి  ప్రజాసమస్యలు, రాష్ట్ర ప్రయోజనాలకు సంబంధించిన అంశాలపై పార్లమెంట్ లో తన వాణిని వినిపిస్తున్నారు. ఎంపీ విజయసాయిరెడ్డి శుక్రవారం రాజ్యసభలో ప్రైవేట్‌ మెంబర్‌ బిల్లును ప్రవేశపెట్టారు. శాసనసభ్యుల అనర్హతకు సంబంధించిన ఆర్టికల్‌ 102, 191లకు సవరణలు ప్రతిపాదిస్తూ సభలో విజయసాయిరెడ్డి బిల్లు ప్రవేశపెట్టారు. 

శాసనసభ సభ్యుల అనర్హతకు సంబంధించి తమముందుకు వస్తున్న ఆరోపణలపై ఎలాంటి నిర్ణయమూ తీసుకోకుండా స్పీకర్లు సంవత్సరాలపాటు తొక్కిపెడుతున్న సందర్భాలు ఉంటున్న నేపథ్యంలో దీనిలో మార్పు రావాల్సిన అవసరముందని విజయసాయి రెడ్డి ఈ బిల్లును ప్రవేశపెట్టారు. 
చంద్రబాబు అవినీతి సొమ్ముకు ఆశపడి ఏపీలో 20 మంది వైయస్సార్సీపీ ఎమ్మెల్యేలు పార్టీ ఫిరాయించారు. ఓ పార్టీ సింబల్ పై గెలిచి అనైతికంగా మరో పార్టీలోకి మారడం, వారిపై అనర్హత వేయకుండా స్పీకర్ అధికార పార్టీకి తొత్తులా వ్యవహరిస్తూ రాజ్యాంగాన్ని అపహాస్యం చేశారు.  

Back to Top