ఉచిత వైఫై వినియోగంపై అవకతవకలను అరికట్టాలి

న్యూఢిల్లీ: గుర్తించిన రైల్వే స్టేషన్లలో ఉచిత వైఫై వినియోగంపై జరుగుతున్న అవకతవకలపై రాజ్యసభలో వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ ఎంపీ విజయసాయిరెడ్డి ప్రశ్నించారు. ఇలాంటి అవకతవకలను అరికట్టాలని ఆయన కోరారు. సభలో విజయసాయిరెడ్డి మాట్లాడుతూ.. రైల్వే స్టేషన్లలో ఉచిత వైఫై సౌకర్యం కల్పించడం సంతోషకరమన్నారు. ప్రయాణికేతరులు కూడా వైఫై ఉపయోగించుకోవడం జరుగుతుందని, దీన్ని అరికట్టేందుకు రైల్వే శాఖ ఎలాంటి చర్యలు చేపడుతుందో చెప్పాలని ఆయన విజ్ఞప్తి చేశారు. పీఎన్‌ఆర్‌ నంబర్‌ ఎంటర్‌ చేసిన వారికే ఉచిత వైఫై సౌకర్యం వినియోగించుకునే అవకాశం కల్పిస్తే ప్రయోజకరంగా ఉంటుందని విజయసాయిరెడ్డి చెప్పారు.

Back to Top