చంద్రబాబును పల్లెల్లోనికి రానీయవద్దు

 ఎస్సీ ఎస్టీ సబ్‌ ప్లాన్‌ ను నీరుగారుస్తున్నారు. ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ చట్టాన్ని చుట్టంగా వాడుకుంటున్నారని వైయస్‌ ఆర్‌ సీపీ ఎస్సీ విభాగం అధ్యక్షులు మేరుగ నాగార్జున మండిపడ్డారు.శ్రీకాళహస్తి పల్లమాలలో ప్రజా సంకల్పయాత్రలో భాగంగా సోమవారం నిర్వహించిన ఎస్సీల ఆత్మీయ సమ్మేళనంలో ఆయన ప్రసంగించారు.రాçష్ట్రంలోపాలన అనేది అస్తవ్యస్థంగా ఉందన్నారు. దళిత స్త్రీలను వివస్త్రలను చేస్తున్నారనీ, ఎస్సీల పురోభివృద్ధికి ఉపయోగకరమైన పథకాలను నీరుగారుస్తున్నార న్నారు.
చంద్రబాబు అవలంబిస్తున్న విధానాలకు నిరనసగా ఆయనను పల్లెల్లోకి రానీయకుండా చేయాలని పిలుపునిచ్చారు. బాబు దళిత వ్యతిరేక విధానాలను ప్రతి వేదికపైనా నిలదీయాలని అన్నారు
 దళితుల సంక్షేమాన్ని గురించి నిరంతరం తపించేది వైయస్‌ ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీయే అని. అందుకనే పార్టీ అధ్యక్షులు వైయస్‌ జగన్‌  మంచి ఆలోచనతో దళితుల బాధలను తెలుసుకోడానికి ఆత్మీయ సమ్మేళనం నిర్వహిస్తున్నారన్నారు. నవరత్నాలు ప్రతి దళిత కుటుంబానికి అండగా ఉంటాయి. అంబేద్కర్‌ , జగ్జీవన్‌ రాం గారి ఆలోచనలు, ఆశయాలకు అనుగుణంగా జగన్‌ మోహన్‌ రెడ్డి పనిచేయనున్నారంటూ భరోసా ఇచ్చారు. 

Back to Top