ప్రజాస్వామ్య పరిరక్షణకు పోరుబాట

కడియం : ప్రజాస్వామ్యాన్ని పరిహాస్యం చేస్తున్న చంద్రబాబు తీరు పట్ల సర్వత్రా నిరసనలు వ్యక్తమవుతున్నాయి. ప్రజాస్వామ్యాన్ని కాపాడుకునేందుకు వైయ‌స్ఆర్ సీపీ పోరుబాట‌ను ఎంచుకుంది. పార్టీ అధినేత వైయ‌స్ జ‌గ‌న్‌మోహ‌న్‌రెడ్డి ఆదేశాల మేర‌కు శుక్రవారం కడియంలో ధర్నా, నిరసన కార్యక్రమాలు చేపడుతున్నట్లు ఆ పార్టీ గ్రేటర్ రాజమహేంద్రవరం అధ్యక్షుడు కందుల దుర్గేష్, కోఆర్డినేటర్‌లు ఆకుల వీర్రాజు, గిరజాల వీర్రాజు (బాబు)లు తెలిపారు. ఈ సంద‌ర్భంగా వారు మాట్లాడుతూ.. పార్టీలు ఫిరాయించిన వారికి మంత్రి పదవులు కట్టబెట్టి చంద్రబాబు తన రెండునాల్కల ధోరణిని మరోసారి బ‌య‌టపెట్టుకున్నారన్నారు. తాను చేస్తే రైటు, ఎదుటి వారు చేస్తే తప్పు అన్నరీతిలో వ్యహరిస్తున్న చంద్రబాబు తగిన బుద్ధి చెప్పాల్సిన అవ‌స‌ర‌ముంద‌న్నారు. స్థానిక తహశీల్దార్ కార్యాలయం వద్ద చేప‌డుతున్న ధ‌ర్నా కార్య‌క్ర‌మానికి నియోజకవర్గంలోని పార్టీ నాయకులు, కార్యకర్తలు పెద్ద ఎత్తున‌ హాజరు కావాల్సిందిగా కోరారు.

Back to Top